Share News

స్వార్థరహిత జీవనమే దైవ సన్నిధికి మార్గం

ABN , Publish Date - Nov 03 , 2024 | 12:05 AM

స్వార్థరహిత జీవనం సాగించే వారికే దైవసన్నిధికి చేరుకునే మార్గం సిద్ధిస్తుందని సూర్యా పేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ విచారణ గురువు మార్టిన పసల అన్నారు.

స్వార్థరహిత జీవనమే దైవ సన్నిధికి మార్గం
మఠంపల్లిలో సమాధులను పూలు, దీపాలతో అలంకరించిన క్రైస్తవులు

ఆత్మల పండుగ సందర్భంగా సమాధుల అలంకరణ

మఠంపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : స్వార్థరహిత జీవనం సాగించే వారికే దైవసన్నిధికి చేరుకునే మార్గం సిద్ధిస్తుందని సూర్యా పేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ విచారణ గురువు మార్టిన పసల అన్నారు. సకల ఆత్మల పండగను పురస్కరించుకుని మఠంపల్లి క్రైస్తవ శ్మశానవాటికలో శనివారం ఆత్మల పండుగాను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 2న జరుపుకునే ఈ పండుగలో మరణించిన వారిని కుటుంబీకులు స్మరించుకోవడంతో పాటు వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగేందుకు ప్రత్యేక ప్రార్థనలు చేసే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతున్నట్లు వివరించారు. మానవళి జీవన సరళి పాపభీతి, ఆధ్యాత్మిక చింతనలతో సాగాలని ఉద్భోదించారు. విశ్వాసులు ఆత్మీయుల సమాధులను పుష్పాలతో అలంకరించి, కొవ్వొత్తులను వెలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శుభవార్త దేవాలయంలో విచారణ గురువుల మార్టిన పసల ప్రసంగం కొనసాగింది. ఆయనతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 12:05 AM