సీతకష్టాలు పాఠ్యాంశంపై విద్యార్థులతో బుర్రకథ
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:33 AM
అటు ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూనే, ఇటు పాఠాలను గుర్తుంచుకునేలా వినూత్నంగా ప్రయత్నించారు
మద్దిరాల మండలం గోరెంట్ల పాఠశాలలో విద్యార్థులతో ప్రయోగం
మద్దిరాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : అటు ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూనే, ఇటు పాఠాలను గుర్తుంచుకునేలా వినూత్నంగా ప్రయత్నించారు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. 7వ తరగతి తెలుగు వాచకంలోని సీత కష్టాలు పాఠ్యాంశాన్ని తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ విద్యార్థులతో సోమవారం బుర్రకథ రూపంలో ప్రదర్శించారు. విద్యార్థులు సాయికృష్ణ, గాయత్రి, రాజే్‌షలు సీత కష్టాలు పాఠ్యాంశాన్ని బుర్రకథ రూపంలో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇనచార్జి ప్రధానోపాధ్యాయుడు బిక్కి రమే్‌షగౌడ్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న ప్రాచీన కళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ ప్రయత్నం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న కళాత్మకతను వెలికి తీయవచ్చన్నారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయుడిని, విద్యార్థులను ఉపాధ్యాయులు కృష్ణవేణి, శ్రీను, సీఆర్పీలు నవీన, ఉపేందర్, రమేష్, శిరీష, మురళీధరన, మళ్లికార్జున, అభినవ్, శ్రీలత తదితరులు అభినందించారు.