Share News

నిరుపయోగంగా బస్టాండ్‌ షెడ్‌

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:29 AM

యాదిరిగుట్ట ఆర్టీసీ బస్టాండ్‌ రేకులషెడ్‌ నిరుపయోగంగా ఉంది. ఈ షెడ్‌ నిరుపయోగంగా యాచకులు, ఇతరులకు అడ్డాగా మారింది.

నిరుపయోగంగా బస్టాండ్‌ షెడ్‌

ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు స్థానికులు

యాదగిరిగుట్ట రూరల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): యాదిరిగుట్ట ఆర్టీసీ బస్టాండ్‌ రేకులషెడ్‌ నిరుపయోగంగా ఉంది. ఈ షెడ్‌ నిరుపయోగంగా యాచకులు, ఇతరులకు అడ్డాగా మారింది. 30సంవత్సరాల క్రితం కొండపైకి వెళ్లడానికి ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక రేకులషెడ్‌ నిర్మించి, ప్లాట్‌ఫామ్‌గా ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు ప్రయాణికుల కోసం వినియోగించుకున్న షేడ్‌ ప్రస్తుతం పోకిరీలు, యాచకులకు నిలయంగా మారింది. ఇందులో రాత్రిలో వేళలో మద్యం సేవిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌ షెడ్‌లో ఇలాంటి సంఘటనలపై అధికారుల దృష్టికి స్థానికులు, ప్రయాణికులు తీసుకవెళ్లినప్పటికీ ఫలితం లేకుండ పోయింది. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్‌లోని రేకులషెడ్‌ పూర్తిగా తొలగిస్తారా లేక దానిని కార్గో గోదముగా మార్చుతారా? తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

అంధకారంగా బస్టాండ్‌

ఉదయం నుంచి రాత్రి 11గంటల వరకు ప్రయాణికుల తాకిడి ఉన్న బస్టాండ్‌లో ఈ మధ్య కాలంలో విద్యుత దీపాలు వెలగడంలేదు. గతంలో బస్టాండ్‌లో మెర్క్యురీ లైట్లు ఉండి, బస్టాండ్‌ ఆవరణ వెన్నెల వెలుగులా ఉండేది. ప్రస్తుతం లైట్లు లేకపోవడంతో పూర్తిగా అంధకారంగా మారింది. ప్రయాణికులకు దొంగలు, పోకిరీల బెడదతో ఎక్కువైందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు బస్టాండ్‌పై జిల్లాస్థాయి అధికారులు వెంటనే స్పందించి రాత్రినుంచి మొదులుకొని తెల్లవారు జాము వరకు లైట్లు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదు చేశా

స్థానికబస్టాండ్‌ రేకులషెడ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. రాత్రి సమయంలో బస్టాండ్‌లో విద్యుత సౌకర్యం లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారగా మారోవైపు గంజాయి సేవిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి అధికారులు స్పందించిన వెంటనే షెడ్‌ను తొగించి స్థానికులు, ప్రయాణికులకు ఇబ్బందు లు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి

- సీస శ్రీనివాస్‌, స్థానికుడు

తగిన నిర్ణయం తీసుకుంటాం

ప్రస్తుతం రేకులషేడ్‌ నిరుపయోగంగా ఉంది. ఇందులో యాచకులు, పోకిరీలకు అడ్డాగా మారిందని స్థానికులు మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఆర్‌ఎం దృష్టికి తీసుకవెళ్లాం. ప్రత్యేక బృందం వచ్చి, రేకుల షెడ్‌ను పరిశీలించింది. బస్టాండ్‌లో ఎక్కువగా విద్యుత్‌ దీపాలు ఉండటంతో ప్రతినెలా కరెంట్‌ బిల్లు వస్తోంది. అప్పుడప్పుడు విద్యుత్‌ సరఫరాలో తేడా వస్తోంది. తగిన సౌకర్యం కల్పిస్తాం.

-ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌గౌడ్‌, యాదగిరిగుట్ట

Updated Date - Oct 26 , 2024 | 12:29 AM