నిరుపయోగంగా విశ్రాంతి భవనం
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:32 AM
మండల కేంద్రంలోని విశ్రాంతి భవనం నిధుల కొరతతో నిరుపయోగంగా ఉంది. దీని నిర్వహణ భారంగా మారి అధికారులు, నేటి పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శ ఉంది.
నిర్వహణకు నిధుల కొరత
రూ.15వేలు పేరుకుపోయిన విద్యుత బిల్లు బకాయి
విద్యుత సప్లయ్ నిలిపివేత
వలగొండ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని విశ్రాంతి భవనం నిధుల కొరతతో నిరుపయోగంగా ఉంది. దీని నిర్వహణ భారంగా మారి అధికారులు, నేటి పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శ ఉంది. గతంలో ప్రభుత్వం ముఖ్యమైన అసరాల మేరకు గెస్ట్‌హౌ్‌సలను నిర్మించారు. ఇది పంచాయతీరాజ్ ఏఈ పర్యవేక్షణ ఉంటుంది. దీనికి ఒక వాచమన ఉండేవారు. కానీ నేడు స్థానిక గెస్ట్‌హౌస్ నిర్వహణ నిర్లక్ష్యానికి గురయ్యింది. ‘కర్ణుడి చావుకు సవలక్ష కారణాలు’ అన్నట్టు దీని పట్టించుకునేవారే కరువయ్యారు. సుమారు 12 లక్షల రూపాయల నిర్మాణ వ్యయంతో 2007 జూలై 20న నాటి రామన్నపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పునూతల పురోషోత్తం హయాంలో ఈ వసతిగృహన్ని నిర్మించారు. ఆరంభంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వసతి గృహాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ దీని నిర్వణపై నిలినీడలు కమ్ముతున్నాయి. సకాలంలో ప్రభుత్వం నిధులు కేటాయించడపోవడంతో నిర్వహణ భారంగా మారింది. విద్యుత బిల్లు రూ.15వేల వరకు బకాయిపడింది. విద్యుతశాఖ అధికారులు ఈ విశ్రాంతి భవనానికి విద్యుత సప్లయ్ నిల్పివేశారు. ఈ అతిఽథిగృహం చుట్టూ ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. శుభ్రం చేసేవారే లేరు. వేసిన తాళాలు వేసినట్టుగా గానే ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉడండటంతో దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది. వాచమన లేకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. గెస్ట్‌హౌస్ నిరుపయోగంగా ఉండటంతో ఈ ప్రాంతానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్లాలో అర్థంకాక, ఏ నాయకుడి ఇంట్లోనో కొద్దిసేపు కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి. అతిఽథిగృహం లోపల కొంతమేరకు ఫర్నిచర్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వసతి గృహాలకు నిధులు కేటాయించి వాడుకలోకి వచ్చేట్లు తగిన చర్యలు తీసుకోవాలని పాలకులను మండల వాసులు కోరుతున్నారు.
ప్రభుత్వం నిధులు కేటాయించాలి
విశ్రాంతి భవనానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఉపయోగంలోకి వచ్చేటట్లు అధికారులు తగిన జాగ్త్రత్తలు తీసుకోవాలి. ఈ గె్‌స్టహౌస్ చుట్టూ అపరిశుభ్రంగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు అసౌకర్యానికి గురివుతున్నారు.
-బోళ్ల సుదర్శన, బీజేపీ మండల అధ్యక్షుడు
వాచమన లేక నిర్వహణ కష్టం అవుతోంది
అతిఽథి గృహాన్ని చూసుకోవడానికి ఒక వాచమన అవసరం. గతంలో విధులు నిర్వహించిన వ్యక్తి రిటైర్డ్ అయ్యాడు. సరైన నిధులు కేటాయించి, వాచమన పోస్ట్‌ను భర్తీ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకు వెళతాను.
-సందీ్‌పరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ