Share News

చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చర్యలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:06 AM

ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు.

చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చర్యలు
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ చందనాదీప్తి

నల్లగొండ టౌన, జనవరి 29: ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సడేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది నుంచి ఫిర్యాదులు తీసుకొని వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోనలో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో భూ సమస్యలు, దంపతుల మధ్య విభేదాలు, ఫైనాన్స సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్‌ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు. స్టేషనకి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు తీసుకొని వాటిపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఫిర్యాదుదారుడికి భరోసా కల్పించేలా వ్యవహరించాలన్నారు. బాధితుల ప్రతీ ఫిర్యాదును ఆనలైనలో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 12:06 AM