Share News

మెనూ పాటించకపోతే చర్యలు

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:03 AM

వసతిగృహాలు, పాఠశాలల్లో మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యా కమిషన్‌ సభ్యురాలు జ్యోత్స్నారెడ్డి అన్నారు. మోత్కూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల, బీసీ బాలుర హాస్టళ్లను సోమవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్‌ సభ్యురాలు కందాడి జ్యోత్స్నశివారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మెనూ పాటించకపోతే చర్యలు

తెలంగాణ విద్యా కమిషన్‌ సభ్యురాలు జ్యోత్స్నారెడ్డి

మోత్కూరు, వలిగొండ, మోటకొండూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యో తి): వసతిగృహాలు, పాఠశాలల్లో మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యా కమిషన్‌ సభ్యురాలు జ్యోత్స్నారెడ్డి అన్నారు. మోత్కూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల, బీసీ బాలుర హాస్టళ్లను సోమవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్‌ సభ్యురాలు కందాడి జ్యోత్స్నశివారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సరుకులను, వంట గదిని, వండిన ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. మెనూ ఖచ్చితంగా పాటించాలని వారెన్లను ఆదేశించారు. హాస్టల్‌ గదులను, వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వార్డెన్లు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భోజనం ఎలా ఉం టుందని, మెనూ ప్రకారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బీసీ సంక్షేమ జిల్లా అధికారి బి.యాదయ్య, మోత్కూరు ఎస్‌ఐ డి.నాగరాజు, హాస్టల్‌ వార్డెన్‌ రాజాలుభాయి ఆమె వెంట ఉన్నారు.

నాణ్యమైన భోజనాన్ని అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ సభ్యురాలు జ్యోత్స్నారెడ్డి అన్నారు. వలిగొండ, మోటకొండూరు మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. వలిగొండ మండ ల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాల మధ్నాహ్న భోజనం, లోతుకుంట గ్రామంలోని కేజీబీవీ వసతిగృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేజీబీవీలో నాణ్యమైన కూరగాయలు సరిగ్గాలేవని, కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అదే విధంగా మోటకొండూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలిక ల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదులు, బి య్యం, పప్పు,కూరగాయల నిల్వ గదిని పరిశీలించారు. ఆమెవెంట డీఆర్‌డీఏ పీడీ నాగిరెడ్డి, డీఈవో సత్యనారాయణ, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి యాదయ్య, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి జైపాల్‌రెడ్డి, ఎంఈవోలు భాస్కర్‌, రఘురామ్‌రెడ్డి, ఎస్‌వో దుర్గ, ప్రిన్సిపాల్‌ జ్యోతి తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:03 AM