విధుల్లో నిర్లక్ష్యం చూపితే వార్డెన్లపై చర్యలు
ABN , Publish Date - Oct 19 , 2024 | 12:43 AM
హాస్టళ్లు తెరిచి మూడు రోజులు గడిచినా వార్డెన్లు విధులకు హాజరుకావడంలేదు. దీంతో సెలవుల్లో ఇంటికి వెళ్లిన విద్యార్థులూ హాస్టళ్లకు రావడం లేదు. విద్యార్థులు రానందున వండి, వడ్డించే పని లేదని వర్కర్లూ రావడం లేదు.
బీసీ సంక్షేమ జిల్లా అధికారి యాదయ్య
(ఆంధ్రజ్యోతి, మోత్కూరు):హాస్టళ్లు తెరిచి మూడు రోజులు గడిచినా వార్డెన్లు విధులకు హాజరుకావడంలేదు. దీంతో సెలవుల్లో ఇంటికి వెళ్లిన విద్యార్థులూ హాస్టళ్లకు రావడం లేదు. విద్యార్థులు రానందున వండి, వడ్డించే పని లేదని వర్కర్లూ రావడం లేదు. వార్డెన్లు విధులు సక్రమంగా నిర్వహించకపోవడం, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతోనే హాస్టళ్లు మూత పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ అంశాలపై బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి పి.యాదయ్య ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లపై చర్య తీసుకుంటామన్నారు.
ఆంధ్రజ్యోతి: హాస్టళ్లు తెరిచి మూడు రోజులైనా మోత్కూరు బీసీ హాస్టళ్ల ఘటన మీ దృష్టికి వచ్చిందా?
యాదయ్య: నా దృష్టికి రాలేదు. విద్యార్థులు వచ్చినా, రాకున్నా వార్డెన్లు, వర్కర్లు కచ్చితంగా విధుల్లో ఉండాలి.
ఆం: తహసీల్దార్, ఎంఈవో, మునిసిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ గురువారం (ఈ నెల 17న) హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు కదా? ఆ వివరాలు తెలియదా?
యా: వారు తనిఖీ చేసినట్టు తెలిసింది. వివరాలు తహసీల్దార్ నుంచి తీసుకుని మూడు హాస్టళ్లకు వార్డెన్‌గా ఉన్న జ్యోతికి నోటీస్ ఇచ్చి వివరణ కోరుతా.
ఆం: జిల్లాలో ఎన్ని హాస్టళ్లు ఉన్నాయి? ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?
యా: జిల్లాలో బీసీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు 15 ఉండగా, అందులో రెండు హాస్టళ్లు విద్యారు ్థలు లేక నడవడం లేదు. మిగిలిన 13 హాస్టళ్లలో సుమారు 550 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు కళాశాలల హాస్టళ్లు ఉండగా అందులోనూ సుమారు 550 మంది విద్యార్థులు ఉన్నారు.
ఆం: జిల్లాలో ఎన్ని హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లు ఉన్నారు. ఎన్ని హాస్టళ్లు ఇన్‌చార్జీలతో నడుస్తున్నాయి.
యా: జిల్లాలో ప్రీమెట్రిక్, కళాశాల హాస్టళ్లు కలిసి 18 ఉండగా, 11 హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లు ఉన్నారు. మిగతా ఏడు హాస్టళ్లు ఇన్‌చార్జీలతో నడుస్తున్నాయి.
ఆం: మోత్కూరుకు నూతనంగా మంజూరైన కళాశాల హాస్టల్‌లో విద్యార్థులకు లాగిన్ ఇవ్వనందున వార్డెన్ భోజనం పెట్టడం లేదంటున్నారు?
యా: నూతనంగా మంజూరైన కళాశాల హాస్టల్‌కు ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చింది. లాగిన్ చేయించుకోవడం వార్డెన్ బాధ్యత. అందులో 10మంది విద్యార్థులు ఉన్నారని చెబితే వారికి భోజనం పెట్టాని వార్డెన్‌ను ఆదేశించా. వార్డెన్ భోజనం పెట్టననడంపై విచారించి చర్యలు తీసుకుంటాం.
ఆం: వార్డెన్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, మెనూ ప్రకారం భోజనం ఇవ్వకపోవడంతోనే