అర్హులైన పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి
ABN , Publish Date - Feb 24 , 2024 | 12:27 AM
జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ దాసరి హరిచందన కోరారు.
కలెక్టర్ హరిచందన
నల్లగొండ టౌన, ఫిబ్రవరి 23: జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ దాసరి హరిచందన కోరారు. చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా చూడాలన్నారు. మార్చి 3న నిర్వ హించే పల్స్‌పోలియో కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ట్రాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 3న ఎవరైనా చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకోకపోతే వారికి 4, 5 తేదీల్లో వారి ఇంటికి వెళ్లి పోలియో బృందాలు చుక్కలు వేస్తాయన్నారు. జిల్లాలో సుమారు 1,54,895 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారని, వీరికోసం 1,070 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని, అలాగే 4,280 పల్స్‌పోలియో బృందాలను, 107మంది సూపర్‌వైజ ర్లను నియమించామన్నారు. సమావేశానికి డిప్యూటీ డీఎంహెచవో డాక్టర్ వేణుగోపాల్, జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్ జమీర్, సర్వే లెన్స మెడికల్ అధికారి డాక్టర్ ప్రశాంత, జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలనుఉ సాధించేందుకు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. విద్యార్థులు పరీక్షల లక్ష్యంతో పాటు, జీవిత లక్ష్యాలను పెట్టుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహంతో పాటు గట్టుప్పల, మర్రిగూడెం, అయిటిపాముల గిరిజన బాలుర వసతిగృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి నింపుతూ ప్రతి విద్యార్థి తన బలాన్ని, బలహీనతలను విశ్లేషించుకో వాలన్నారు. ఆమె వెంట హౌసింగ్ పీడీ, ఇన చార్జి డిటీడబ్ల్యూ రాజ్‌కుమార్, ఏటీడబ్ల్యూవో లక్ష్మారెడ్డి, హాస్టల్లో వెల్ఫేర్ అధికారి రామకృష్ణ, ప్రిన్సిపాల్ హనుమాక్షి ఉన్నారు.
పది పరీక్షల్లో పాతబార్‌కోడ్ విధానం
నల్లగొండ: పదో తరగతి పరీక్షల్లో పాత బార్‌కోడ్ పద్ధతిని అవలంభించాలని డీఈవో భిక్షపతి అన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని సెయింట్ అల్ఫెనెస్స్ హైస్కూల్‌లో అధికారులు, ఉద్యోగులకు ఓరియేంటేషన, శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
మెడికల్ కళాశాలపై సమీక్ష
మెడికల్ కళాశాలను శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సందర్శించి ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలకు సంబంధించి అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి, సూపరింటెండెంట్ నిత్యానంద పాల్గొన్నారు.