‘అంబుజా’ పరిశ్రమ పనుల అడ్డగింత
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:31 AM
రామన్నపేట పట్టణ పరిధిలో అంబుజా సిమెం ట్ పరిశ్రమ ప్రతిపాదిత స్థలంలో పనులను స్థా నికులు అడ్డుకున్నారు. శుక్రవారం భారీ యం త్రాలతో పనులు చేసేందుకు వచ్చిన సిబ్బందిని స్థానిక ప్రజలు, పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు అక్కడినుంచి పంపించివేశారు.
సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాల్సిందే
పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకుల డిమాండ్
రామన్నపేట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రామన్నపేట పట్టణ పరిధిలో అంబుజా సిమెం ట్ పరిశ్రమ ప్రతిపాదిత స్థలంలో పనులను స్థా నికులు అడ్డుకున్నారు. శుక్రవారం భారీ యం త్రాలతో పనులు చేసేందుకు వచ్చిన సిబ్బందిని స్థానిక ప్రజలు, పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు అక్కడినుంచి పంపించివేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జెల్లెల పెంటయ్య, కో కన్వీనర్ ఎండీ.రేహన్ మాట్లాడుతూ అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా ప్రజలందరూ వ్యతిరేకించి రెండు నెలలు గడిచి నా యాజమాన్యం స్పష్టత ఇవ్వకుండా భారీ యంత్రాలతో పనులు ప్రారంభించాలని చూస్తో ందన్నారు. లాజిస్టిక్ పార్క్ పేరుతో అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు ప్రారంభిస్తే ప్రజలు తిరగబడతారని అన్నారు. సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను, పర్యావరణ పరిరక్షణ వేదిక సభ్యులకు సర్దిచెప్పి వాహనాలను బయటకు పంపించివేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నాయకులు బల్గూరి అంజయ్య, కందుల హనుమంతు, కల్లూరి నగేష్, గొరిగె సోములు, ఎండీ.రషీద్, మునికుంట్ల లెనిన్, పులి భిక్షం, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, రేపాక లింగస్వామి, తదితరులు ఉన్నారు.