Share News

అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలి

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:35 AM

కేంద్రమంత్రి అమిత్‌షాను కేబినెట్‌ నుంచి తొలగించాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ చేపట్టిన నిరసనలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం భువనగిరిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలి

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ప్రజాప్రతినిధులు

భువనగిరి టౌన్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి అమిత్‌షాను కేబినెట్‌ నుంచి తొలగించాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ చేపట్టిన నిరసనలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం భువనగిరిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ నిర్మా త అంబేడ్కర్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాను ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ నిరసన చేపట్టినట్టు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌కు ఊరేగింపుగా వెళ్లారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ ఎండీ అవేజ్‌చిస్తీ, పెద్దసంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.

భువనగిరి గంజ్‌: పార్లమెంట్‌లో అంబేడ్కర్‌పై అమిత్‌షా అ నుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాకేంద్రం నుంచి కలెక్టరేట్‌ వర కు వాహనాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, మునిసిపల్‌ చైర్మన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు బర్రె జహంగీర్‌, తంగళ్లపల్లి రవికుమార్‌, పో త్నక్‌ ప్రమోద్‌కుమార్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి, పులిగిల్ల బాలయ్య, భరత్‌ గౌడ్‌, క్యాసగల్ల చందు, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

భువనగిరి (కలెక్టరేట్‌): అమిత్‌షాను వెంటనే బర్తరఫ్‌ చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డిలతో కలిసి కలెక్టర్‌ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పారేయాలని ఆర్‌ఎ్‌సఎస్‌ ఆనాడే అన్నదని, ప్రజలు గమనించి బీజేపీకి 400 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:35 AM