Share News

ఏపీజీవీబీ.. ఇక టీజీవీబీ

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:10 AM

గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) జనవరి ఒకటో తేదీనుంచి తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌గా మారనుంద ని బ్యాంక్‌ రీజనల్‌ (ఉమ్మడి నల్లగొండ, జనగామ జిల్లాలు) మేనేజర్‌ శ్రీనివాస్‌ చెన్న తెలిపారు. శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీజీవీబీ.. ఇక టీజీవీబీ

జనవరి ఒకటో తేదీ నుంచి సేవలు షురూ

ఏపీజీవీబీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ చెన్న

భువనగిరి టౌన్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) జనవరి ఒకటో తేదీనుంచి తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌గా మారనుంద ని బ్యాంక్‌ రీజనల్‌ (ఉమ్మడి నల్లగొండ, జనగామ జిల్లాలు) మేనేజర్‌ శ్రీనివాస్‌ చెన్న తెలిపారు. శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మరింత మెరగైన బ్యాంకింగ్‌ సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఏపీజీవీబీని విభజించి తెలంగాణలోని బ్రాంచ్‌లతో కలిపి టీజీవీబీ గా ఏర్పాటైందని తెలిపారు. టీజీవీబీ పరిధిలో రాష్ట్రంలో 912 శాఖలు ఉండనుండగా రూ.75వేల కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉం దని, దీంతో దేశంలోనే 2వ అతిపెద్ద గ్రామీణ బ్యాంక్‌గా టీజీవీబీ స్థానం సుస్థిరం కానుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతు న్న సేవలతో పాటు మరిన్ని నూతన సేవలను ఖాతాదారుల కు అందించనున్నట్లు తెలిపారు. రీజియన్‌ పరిధిలోని 45 బ్యాంకులలో 4.50లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని, రూ. 1200 కోట్ల డిపాజిట్లు ఉండగా రూ.2500కోట్లు రుణాలుగా ఇచ్చినట్లు తెలిపారు. భువనగిరిలోని ప్రాసెసింగ్‌ కేంద్రం ద్వారా రీజనల్‌ పరిధిలో రూ.1.50కోట్ల రుణ మంజూరవుతోందని, ఈ తరహా సదుపాయం మరే ఇతర బ్యాంకులకు లేదన్నారు. టీజీవీబీగా రూపాంతరం చెందుతుండడంతో ఈ నెల 28,29, 30,31 తేదీల్లో టీజీవీబీ బ్యాంకింగ్‌ సేవలన్నీ నిలిచిపోతాయని, జనవరి ఒకటో తేదీ నుంచి పునరుద్దరిస్తామన్నారు. అలాగే టీజీవీబీ బ్యాంకులన్నింటికీ ఒకే ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ ఖిఆఐూ0ఖఖఈఈఆ ఉంటుందన్నారు. సమావేశంలో రీజినల్‌ సీనియర్‌ మేనేజర్లు కిరణ్‌సింహ, సూరజ్‌ బుట్టే పాల్గొన్నారు.

(మోత్కూరు): ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంకు 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో విలీనం కానున్నట్లు బ్యాంకు మేనేజర్‌ సీహెచ్‌. గీత తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు విలీనం కానున్నట్లు పేర్కొన్నారు.

(ఆలేరు): ఈ నెల 28 నుంచి 31 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ మూడు రోజుల పాటు సేవలు నిలిచిపోనున్నాయని రాజాపేట ఏపీజీవీబీ మేనేజర్‌ తిరుమలశెట్టి నాగలక్ష్మి తెలిపారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించి సహకరించాలన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:10 AM