Share News

దరఖాస్తుల విచారణ చేయాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:44 AM

జిల్లాలో యుద్ధప్రాతిపదికన ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల విచారణ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శనరెడ్డి అన్నారు.

దరఖాస్తుల విచారణ చేయాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శనరెడ్డితో వీడియోకాన్ఫరెన్సలో పాల్గొన్న కలెక్టర్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శనరెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో యుద్ధప్రాతిపదికన ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల విచారణ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శనరెడ్డి అన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసన మండలి ఓటరు జాబితా రూపకల్పనపై సోమవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌తో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు దరఖాస్తుల విచారణ మిషన మోడ్‌లో పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా నమోదుకు 2025 కోసం స్వీప్‌ కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలని సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు పర్యవేక్షణకు నోడల్‌ అధికారులను నియమించాలని తెలిపారు. ఓటర్ల నమోదుతో పాటు దివ్యాంగులు, థర్డ్‌ జెండర్‌ మొదలగు వర్గాలు, ఆదివాసీ, గిరిజనుల ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ మాట్లాడుతూ ప్రత్యేక స్వీప్‌ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు తయారుచేశామని, ప్రతీ పోలింగ్‌ కేంద్రం పరిధిలో బూత అధికారులను సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు నమోదుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాన్ఫరెన్సలో ఆర్డీవో వేణుమాదవ్‌, ఎలక్షన విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు, డీఈవో అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:44 AM