కార్పొరేట్ హాస్టళ్లకు దీటుగా..
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:02 AM
కార్పొరేట్ రెసిడెన్షియల్ హాస్టళ్లకు దీటుగా సంపూర్ణ సౌకర్యాలతో సమగ్ర విద్యా వసతి విద్యా సంస్థలుగా అనే కీర్తిని ప్రభుత్వ బాలికల ఎస్సీ వసతిగృహాలు పొందుతున్నాయి.
యాదగిరిగుట్ట బాలికల ఎస్సీ హాస్టల్
మెనూ పెంపుపై విద్యార్థుల హర్షం
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 22, (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ రెసిడెన్షియల్ హాస్టళ్లకు దీటుగా సంపూర్ణ సౌకర్యాలతో సమగ్ర విద్యా వసతి విద్యా సంస్థలుగా అనే కీర్తిని ప్రభుత్వ బాలికల ఎస్సీ వసతిగృహాలు పొందుతున్నాయి. ఆ కోవనే యాదగిరిగుట్ట పట్టణంలోని బాలికల ఎస్సీ హాస్టల్ పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన బాలికలకు కొండంత అండగా మారింది. సంపూర్ణ సౌకర్యాలతో ఉన్నత పలితాలు సాధించేందుకు పటిష్టమైన ప్రారంభ పునాదిగా ఈ వసతిగృహం తోడ్పుతోంది. పచ్చదనం పరిశుభ్రత చక్కటి వాతావరణం ఆహ్లాదం కలిగిస్తోంది. పచ్చని మొక్కలతో కనువిందు చేస్తోంది. చక్కటి గదుల్లో ప్యాన్లు, లైట్లు, బెడ్స్ ఉన్నాయి. 1989 సంవత్సరంలో ఈ హాస్టల్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 14మంది మేట్రిన్లు విధులు నిర్వహిస్తుండగా ప్రస్తుతం 96మంది విద్యార్థులతో కొనసాగున్న హాస్టల్‌కు మేట్రిన్‌గా సోని విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం ఉదయం పులిహోర, ఇడ్లీ, రాగిసంకటి, కిచిడీ వీటిలో ఏదో ఒకటి అందిస్తారు. సాయంత్రం స్నాక్స్, ఫ్రూట్స్, బిస్కెట్లతో పాటు రాత్రి కూరగాయలతో చేసిన కర్రీ, పప్పు, సాంబార్‌తో వారికి ప్రత్యేకంగా టేబుళ్లతో ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్‌లో చక్కగా భోజనం అందిస్తారు. ప్రస్తుతం మెస్, కాస్మెటిక్ చార్జీలు పెరగడంతో విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. చలికాలంలో పిల్లలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వారికి ఉచితంగా స్వెట్టర్లను సైతం అందజేసింది. ప్రతీరోజు స్థానిక మేట్రిన్ ఉదయం 5గంటలకు విద్యార్థుల లేపి వారితో పాటుగా ఉంటూ గంటసేపు వారిని చదివించి యోగాసానాలు వుయిస్తారు. దినచర్యలు ముగించుకుని పిల్లలు ప్రతీరోజు మాదిరిగానే ఆల్పాహారం భుజించుకొని పాఠశాల దూరంగా ఉండటంతో వారికి ఆర్టీసీ అధికారులు ఉచితంగా పాఠశాల వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో వెళ్లి సాయంత్రం అదే బస్సులో తిరిగివస్తారు. పిల్లలు స్నానం చేయడానికి ఉదయం నీళ్లు చల్లగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉంది. ప్రతీ రోజు కోతులు అనేక ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రస్తుతం వారికి సోలార్ గ్లీజర్, ప్రహరీగోడ చుట్టూ కోతులు రాకుండా సోలార్ ఫెన్సింగ్ వేయించి రక్షణ కల్చించాల్సి ఉంది.