Share News

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:09 AM

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడుతుండడంతోనే కేటీఆర్‌పై సీబీఐతో అక్రమ కేసు నమోదు చేయించారని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ప్రభుత్వ మాజీ విప్‌ సునితా మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

ప్రభుత్వ మాజీ విప్‌ సునితా మహేందర్‌రెడ్డి

ఆలేరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడుతుండడంతోనే కేటీఆర్‌పై సీబీఐతో అక్రమ కేసు నమోదు చేయించారని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ప్రభుత్వ మాజీ విప్‌ సునితా మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాపాలన పేరుతో రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులపై కక్షసాధిం పు చర్యలకు పాల్పడుతున్నారని, ఏడాదిపాలనలో చేసిందేమీ లేదన్నారు. కేటీఆర్‌ను ఏదో కేసులో ఇరికించి జైలులో పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. లగచర్ల కేసులో ఇరికించాలని ప్రయత్నించి విఫలమైనందున నేడు ఫార్ములా ఈ-కార్‌ రేసులో కేసు పెట్టారని తెలిపారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడడు పుట్ట మల్లే్‌షగౌడ్‌, ‘ఆత్మ’ చైర్మన్‌ జెల్లి నర్సింహులు, జిల్లా ఆర్‌టీఐ సభ్యుడు పంతం కృష్ణ, నాయకులు పత్తి వెంకటేష్‌, కర్రె అశోక్‌, సంపత్‌, ఫయాజ్‌, గోరేమియా, అజయ్‌, రాజు పాల్గొన్నారు.

(యాదగిరిగుట్ట రూరల్‌): ప్రతీ ఒక్కరు ఆధ్మాత్మికత చింతన అలవర్చుకోవాలని గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్లెం స్వామి నివాసంలో అయ్యప్పస్వామి మహాపడి పూజలో పాల్గొని మాట్లాడారు. భక్తిభావం ఉంటేనే మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. గురుస్వామి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన పూజలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, బీఆర్‌ఎస్‌ నేతలు పాపట్ల నరహరి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:09 AM