Share News

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:43 AM

మహిళలు రొమ్ము క్యాన్సర్‌(బ్రెస్ట్‌ క్యాన్సర్‌)పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు.

రొమ్ము క్యాన్సర్‌పై  అవగాహన కలిగి ఉండాలి
జెండా ఊపి టూకే రనను ప్రారంభిస్తున్న కలెక్టర్‌

సూర్యాపేట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : మహిళలు రొమ్ము క్యాన్సర్‌(బ్రెస్ట్‌ క్యాన్సర్‌)పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన రొమ్ము క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 35 ఏళ్లు నిండిన మహిళలు రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలను చేయించుకోవాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్‌ను గుర్తించడంతో ద్వారా ఆ వ్యాధిని నివారించుకునే అ వకాశం ఉందన్నారు. రొమ్ము క్యాన్సర్‌ కొందరికే వస్తుందనే అపోహ ఉందని, ఎవరికైనా ఆవ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేసే రొమ్ము క్యాన్సర్‌ టెస్టులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలన్నారు. రొమ్ముక్యాన్సర్‌కు ఐదు రకాల చికిత్సలు ఉన్నాయని, సరైన క్రమంలో టెస్టులు, మందులు వాడితే క్యాన్సర్‌ తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. అంతకుముందు రొమ్ము క్యాన్సర్‌ నిర్మూలనపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మెడికల్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన టూకే రనలో కలెక్టర్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల బోధనసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:43 AM