Share News

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:26 AM

రోడ్డు భద్రతా, ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ రవిగుప్తా అన్నారు.

 రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి
డీజీపీతో వీడియోకాన్ఫరెన్సలో పాల్గొన్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

సూర్యాపేట క్రైం, జనవరి 23 : రోడ్డు భద్రతా, ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ రవిగుప్తా అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సలో జిల్లా ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను, అవగాహన కార్యక్రమాలను ఎస్పీ రాహుల్‌హెగ్డే డీజీపీకి వివరించారు. సమావేశంలో డీఎస్పీలు నాగభూషణం, ప్రకాష్‌ పాల్గొన్నారు.

న్యాయవాదులు, పోలీ్‌ససిబ్బందికి అభినందనలు

కోర్టుల్లో కేసుల వాదనలను, బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు, కోర్టు పోలీసు విధులను సమన్వయంతో చేసిన సిబ్బందిని ఎస్పీ రాహుల్‌హెగ్డే అభినందించారు. నిందితులకు శిక్షలు విధిస్తూ కోర్టులు ఉత్తర్వులు ఇవ్వడంతో తరుచూ నేరాలకు పాల్పడుతున్న వారు నేరాలు చేయడానికి భయపడుతున్నారని తెలిపారు. వారం రోజుల్లో మూడు ప్రధాన కేసుల్లో నిందితులకు శిక్షలు పడటంపై సిబ్బందిని అభినందించారు. పెనపహాడ్‌ మండలం జలమలకుంట తండాలో లునావత స్వామి 2020లో హత్య చేయగా అభియోగపత్రాలు కోర్టుకు అందజేయడంతో జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.మద్దిరాల మండలం పోలుమల్లలో 2016లో రాగిణి లావణ్యను భర్త లింగయ్య హత్య చేయగా అభియోగపత్రాలు కోర్టులో సమర్పించడంతో నిందితుడికి జీవితఖైదు పడిందన్నారు. మోతె మండలంలో మైనర్‌ను కిడ్నాప్‌ కేసులో గంట మహే్‌షపై పోక్సో కేసు నమోదు చేసి, కోర్టుకు అభియోగాలు అందజేయడంతో అతడికి 34 ఏళ్ల జైలుతో పాటు రూ.60వేలు జరిమానా కోర్టు విధించిందన్నారు.

Updated Date - Jan 24 , 2024 | 12:27 AM