కన్నుల పండువగా అయ్యప్ప పడి పూజ
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:04 AM
తుర్కపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజను కన్నుల పండువగా నిర్వహించారు.
తుర్కపల్లి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): తుర్కపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజను కన్నుల పండువగా నిర్వహించారు. సీఎం సీపీఆర్‌వో బోరెడ్డి అయోధ్యరెడ్డి స్వగృహంలో ఆదివారం పీఎం మనోజ్ తంత్రి గురుస్వామి, పెండెం శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూ జను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి 18 మెట్లను పూల మాలలతో అలంకరించి గణపతి, కుమార స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి, ఉదయం గణపతి పూజతో ప్రాంభించి, సుదర్శన హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, కలశం, అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాల ఊరేగింపు నిర్వహించి పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణంతో ఈ ప్రాంతమతా మారుమోగింది. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప భక్తులు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో గురు స్వాములు పత్తిపాటి హనుమంతరావు, పత్తి పాటి రామారావు, బొట్టు గురుస్వామి, తిప్పారం నాగ, పత్తిపాటి ఆనంద్, పత్తిపాటి సునీల్, బోడ నవీన, తిప్పారం బ్రహ్మచారి, పుట్ట ఆంజనేయులు, పుట్ట ఆంజనేయులు, మడిగె వెంకటస్వామి, శాగర్ల పరమేశ, కూరెళ్ల సందీప్ బండారి కనకరాజుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం సీపీఆర్‌వో బోరెడ్డి అయోధ్యరెడ్డి స్వగృహంలో ఆదివారం పీఎం మనోజ్ తంత్రి గురుస్వామి, పెండెం శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో ప్రముఖ కవి అందె శ్రీ పాల్గొన్నారు.