Share News

నకిలీలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:32 AM

నకిలీ వస్తువులపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో అదనపు కలెక్టర్‌ జి.వీరారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు.

నకిలీలపై అప్రమత్తంగా ఉండాలి

వినియోగదారుల దినోత్సవంలో కలెక్టర్‌ హనుమంతరావు

భువనగిరి (కలెక్టరేట్‌), డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నకిలీ వస్తువులపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో అదనపు కలెక్టర్‌ జి.వీరారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు నకిలీ వస్తువులు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. మారుమూల ప్రాంతాలు, తండాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా వినియోగదారుల హక్కుల సంఘాలు కృషి చేయాలన్నారు. ప్రజలు, రైతులను చైతన్యం చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి మాట్లాడుతూ ఆధునిక యుగంలో వినియోగదారులకు అన్ని రంగాల్లో డిజిటల్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కూడా ఆన్‌లైన్‌లో ఉండడంవల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. కాగా వినియోగదారుల సంఘం తరపున శ్రీనివాసరావు, బాలేశ్వర్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత, సివిల్‌ సప్లయి జిల్లా మేనేజరు జగదీష్‌ కుమార్‌, జిల్లా తూనికలు, కొలతల అధికారి కందగట్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఔషధ తనిఖీ అధికారి అశ్వినికుమార్‌, ఏఎ్‌సవో రోజారాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి

వచ్చే యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం వ్యవసాయశాఖకు సంబంధించిన రుణమాఫీ, రైతుబీమా, పీఎం కిసాన్‌, విత్తనాలు, పురుగు మందులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగి పంటలకు అవసరమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉండి ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అర్హులైన రైతులకు రుణమాఫీ, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, ఏడీవో నీలిమ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:32 AM