Share News

ఏపీలో బ్రాండెడ్‌ మద్యం మనకు తగ్గిన ఆదాయం

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:05 AM

ఏపీలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం, పాత మద్యం విధానానికి స్వస్తి చెప్పి, 2019కు ముందు ఉన్న టెండర్ల పాలసీని తీసుకొచ్చింది.

ఏపీలో బ్రాండెడ్‌ మద్యం మనకు తగ్గిన ఆదాయం

రాష్ట్ర సరిహద్దులో మొత్తం 12దుకాణాలు

నిత్యం రూ.24లక్షల మేర తగ్గిన విక్రయాలు

ఏపీలో క్వార్టర్‌కు అదనంగా రూ.20 ధర

త్వరలో పెరగనున్న మద్యం ధరలు?

(ఆంధ్రజ్యోతి,కోదాడ): ఏపీలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం, పాత మద్యం విధానానికి స్వస్తి చెప్పి, 2019కు ముందు ఉన్న టెండర్ల పాలసీని తీసుకొచ్చింది. అంతేగాక గత ప్రభు త్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్లను తీసుకువచ్చి, వారం రోజుల నుంచి విక్రయా లు ప్రారంభించింది. ఆ ప్రభావం మన రాష్ట్ర సరిహదు ్దలో ఉన్న మద్యం దుకాణాల్లో విక్రయాలపై పడింది. ఫలితంగా ఇక్కడ ఆదాయం తగ్గింది.

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పేరున్న మద్యం బ్రాం డ్లు దొరికేవు కావు. దీంతో ఏపీ సరిహద్దులో ఉన్న గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు తెలంగాణ సరిహద్దులోని గ్రామాలకు వచ్చి బ్రాండెడ్‌ మద్యం తాగి వెళ్లేవారు. దీంతో ఇక్కడి వైన్స్‌ దుకాణదారులు బ్రాండెడ్‌ మద్యం (రాయల్‌ చాలెంజ్‌ విస్కీ, కింగ్‌ ఫిషర్‌ బీర్ల లాంటివి) విక్రయించి ఆదాయం గడించేవారు. సరిహద్దులో ఉన్న ఒక్కో మద్యం దుకాణంలో ఏపీ ప్రజల కారణంగా నిత్యం రూ.1.50లక్ష నుంచి రూ.2లక్షల వరకు విక్రయాలు జరిగేవి. దుకాణాలకు ఇచ్చిన లక్ష్యం లోపు వైన్స్‌ దుకాణాలు విక్రయాలు చేస్తే ప్రభుత్వానికి ఆయా విక్రయాల్లో 50శాతం, లక్ష్యానికి మించి విక్రయాలు చేస్తే 70శాతం ఆదాయం వచ్చింది. ఏపీలో ప్రభుత్వం మారడం, నూతన మద్యం పాలసీకి మొగ్గు చూపడం, ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ దుకాణాలకు బదులు టెండర్లు పిలిచి ప్రైవేట్‌ వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించింది. అంతేగాక బ్రాండెడ్‌ మద్యంను అందుబాటులోకి తెచ్చింది. దీంతో తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని భద్రాచలం, సత్తుపల్లి, ఆశ్వారావుపేట, మధిర, కోదాడ, హుజుర్‌నగర్‌, మిర్యాలగూడ, సాగర్‌ నియోజకవర్గాలతోపాటు, కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో ఉన్న మన రాష్ట్ర మద్యం దుకాణాల్లో విక్రయాలు పడిపోయాయి. కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల్లో రాష్ట్ర సరిహద్దులో 12 వైన్స్‌ దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణంలో రోజుకు రూ1.50లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఏపీ మద్యం ప్రియులకు బ్రాండెడ్‌ మద్యాన్ని విక్రయించేవారు. ఆ లెక్కన రోజుకు రూ.24లక్షలు, నెలకు రూ.7.20కోట్ల విక్రయాలు ఏపీ మద్యం ప్రియుల కారణంగా ఇక్కడి దుకాణాల్లో జరిగేవి. ప్రస్తుతం ఆ మొత్తం విక్రయాలు తగ్గాయి. సరిహద్దులో ఉన్న దుకాణాల్లో విక్రయాలు తగ్గడంతో ప్రభుత్వానికి సైతం సుమారు రూ.1,000కోట్ల మేర ఆదాయం తగ్గినట్టే.

ఏపీలో మద్యానికి అదనపు ధర

ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో రాయల్‌ చాలెంజ్‌ క్వార్టర్‌ రూ.210, ఫుల్‌ బాటిల్‌ రూ.840 ఉంటే, ఏపీ రాష్ట్రంలో క్వార్టర్‌ రూ.230, ఫుల్‌ బాటిల్‌ రూ.920గా ఉంది. క్వార్టర్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.80 అదనపు ధర ఉంది. ధరలో స్వల్ప మార్పే ఉండటంతో, ఏపీకి చెందిన మద్యం ప్రియులు తెలంగాణకు వచ్చేందుకు గతంలా అంతగా ఇష్టపడటం లేదు. దీంతో ఇక్కడ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. కోదాడలో ఓ వైన్స్‌ దుకాణదారుడు ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి రాకముందు రోజుకు రూ.7లక్షల విలువైన మద్యం విక్రయించేవారు. పాలసీ వచ్చాక రూ.5లక్షల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. అంటే రోజుకు రూ.2లక్షల మేర విక్రయాలు తగ్గాయి. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మద్యం ధరల పెంపు ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి ముందుంచినట్టు సమాచారం. క్వార్టర్‌పై రూ.20, బీరుపై రూ.10 ధర పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అదే జరిగితే మద్యం ప్రియులపై మరింత భారం పడనుందని వ్వాపారులు చెబుతున్నారు. అదే విధంగా ఏపీ రాష్ట్రంలో సైతం ఈనెల 26వ తేదీ తర్వాత మద్యం ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మద్యం ధరలు ఇలా

తెలంగాణలో ధరలు ఏపీలో (రూ.)

మద్యంపేరు క్వార్టర్‌ హాఫ్‌ పుల్‌ క్వార్టర్‌ హాఫ్‌ పుల్‌

రాయల్‌చాలెంజ్‌ 210 420 840 230 460 920

ఆఫీసర్స్‌ ఛాయిస్‌ 150 300 600 150 300 600

మ్యాన్సన్‌ హౌస్‌ 170 350 690 220 440 880

ఓల్డ్‌మంక్‌ 180 360 720 230 440 880

ఐబీ 180 360 720 180 360 720

ఓసీ 150 300 600 150 300 600

మెక్‌డోల్‌ 180 360 720 180 360 720

ఓఏబీ 130 - 520 120 - 440

బీర్‌ లైట్‌ స్ట్రాంగ్‌ లైట్‌ స్ట్రాంగ్‌

కింగ్‌ ఫిషర్‌ 150 160 190 200

ఆర్‌సీ 150 160 190 200

Updated Date - Oct 21 , 2024 | 01:05 AM