రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదే
ABN , Publish Date - Dec 09 , 2024 | 12:47 AM
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా గుట్టలో ఆలేరు నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలోనే ఆలేరు అభివృద్ది చేయడానికి రూ.500 కోట్లు, తీసుకొచ్చానని ఇప్పటివరకు రూ.360కోట్లతో పనులు పూర్తిచేశానని తెలిపారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా గుట్టలో ఆలేరు నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలోనే ఆలేరు అభివృద్ది చేయడానికి రూ.500 కోట్లు, తీసుకొచ్చానని ఇప్పటివరకు రూ.360కోట్లతో పనులు పూర్తిచేశానని తెలిపారు. గత ప్రభుత్వం ఆలేరుకు ఎగువన ప్రాజెక్టులు నిర్మించిందే తప్ప చుక్కనీరు ఇవ్వలేదన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, తపాసుపల్లి రిజర్వాయర్ల ద్వారా బీర్ల ఫౌండేషన్ సహకారంతో రూ.80లక్షలు ఖర్చుచేసి గొలుసుకట్టు కాల్వలకు మరమ్మతులుచేసి ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు 120 చెరువులను నింపానని, తాగునీటి కోసం రూ.210కోట్లు మంజూరు చేయించి మిషన్‌భగీరథ పెండింగ్ పైపులైన్ల పనులు మూడు నెలల్లోపు పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకోసం ఇప్పటివరకు రూ.110కోట్ల నిధులు మంజూరు చేయించానని మరో రూ.100కోట్లు అనుమతులు రాబోతున్నాయని, ఇప్పటివరకు రూ.22కోట్ల ఎన్‌ఆర్జీఎస్ అభివృద్ధి పనులు పూర్తిచేశామన్నారు. ఆలేరు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరవతున్నాయని సీఎం, మంత్రుల సహకారంతో మరో 1000 ఇళ్లు అదనంగా మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అన్నం సంజీవరెడ్డి, నార్మల్ చైర్మన్ గుడిపాటి మధుసూధన్‌రెడ్డి, ఆలేరు, మోత్కురు మార్కెట్ కమిటీల చైర్మన్ చైతన్యరెడ్డి, నూనెముంతల విమలవెంకటే్‌షగౌడ్, రాజేష్, యాదగిరిగుట్ట మునిసిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ నరేందర్‌గుప్త, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్, తండ మంగమ్మశ్రీశైలంగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కానుగు బాల్‌రాజ్‌గౌడ్, వెంకటేశ్వర్‌రాజ్, మల్లేశం, శంకర్‌నాయక్, భాస్కర్‌రెడ్డి, ముడిగె పెంటయ్య, కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేశ్‌యాదవ్, గుండ్లపల్లి వాణీభరత్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతిగౌడ్, సుడుగు శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి లింక్ రోడ్డును బీటీరోడ్డుగా నిర్మాణం చేస్తాను
ఆలేరు నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రతిలింక్‌రోడ్డును బీటీ రోడ్డుగా మార్చుతానని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని చొల్లేరు గ్రామం నుంచి జమ్మాపురం వరకు రూ.1.50కోట్లతో నిర్మంచనున్న బీటీరోడ్డుకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మదర్‌డైరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, సాయిలు, వీరస్వామి, శ్రీనివా్‌సగౌడ్ పాల్గొన్నారు.
కురుమల అభివృద్ధికి కృషి
ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన కరుమల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం గుట్టలో కురుమ సంఘం ఆధ్వర్యంలో కలిసి ఈ నెల 14 హదరాబాద్ కోకాపేటలో నిర్మించిన నూతన కురుమ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నర్సింహ, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, బాలనర్సయ్య, గుండా భాస్కర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల వద్దకే ప్రజాపాలన
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
భువనగిరి గంజ్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యో తి) : ఏడాది పాలనలో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేసినట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ప్రజా పాలన-ప్రజా ఉత్సవాల్లో భా గంగా ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో భువనగిరి, తుం గతుర్తి ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలనచేసి అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రజాపాలన పురస్కరించుకొని ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధిం చి మొత్తం 2,68,790 దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరణ చేసినట్లు తెలిపారు. చేయుత, యువవికాసం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, పచ్చదనం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చే శామన్నారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అలేఖ్య బృందం మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు సౌకర్యం, గృహలక్ష్మి, రుణమాఫీ పథకాలపై నాటక ప్రదర్శన నిర్వహించింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గం గాధర్, జడ్పీ సీఈవో శోభరాణి, మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చై ర్మన్ అవైస్ చిస్తీ, ఆలేరు మార్కెట్ చైర్మన్ చైత న్య మహేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కృ ష్ణారెడ్డి, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, డీఆర్డీవో నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.