జలియన్‌వాలాబాగ్ అమరులకు కొవ్వొత్తులతో నివాళి
ABN , Publish Date - Apr 13 , 2024 | 11:49 PM
జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన దుర్ఘటనలో అమరులైన స్వాతంత్య్ర సమరయోధులకు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నేరేడుచర్లలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన దుర్ఘటనలో అమరులైన స్వాతంత్య్ర సమరయోధులకు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నేరేడుచర్లలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. 1919లో జరిగిన దుర్ఘటన ఎన్నటికీ మరువలేనిదని పలువురు మాట్లాడారు. నివాళులర్పించిన వారిలో క్లబ్ డిసి్ట్రక్ట్ చైర్‌పర్సన్ బట్టు మధు, క్లబ్ నేరేడుచర్ల అధ్యక్షుడు చల్లా ప్రభాకర్‌రెడ్డి, సభ్యులు కర్రి సూర్యనారాయణరెడ్డి, సుంకరి క్రాంతికుమార్, కందిబండ శ్రీనివాస్, కొణతం సైదిరెడ్డి, యారవ సురేష్, శంకరాచారి, చిట్యాల శ్రీను, మెట్టు మధు, చందమళ్ల శ్రీను, మలమంటి సత్యనారాయణ తదితరులున్నారు.