Share News

కలెక్టరేట్‌లో క్యాంటీన

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:56 AM

కలెక్టరేట్‌ ఆవరణలో క్యాంటీన ఏర్పాటుకు అధి కారులకలెక్టరేట్‌లో క్యాంటీను ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ‘మన ఉత్ప త్తులు- మన గౌరవం’ పేరుతో భవనంలో ఈ క్యాం టీనను అందు బాటులోకి తీసుకురానున్నారు.

కలెక్టరేట్‌లో క్యాంటీన

ఇందిరా మహిళా శక్తి భవనం పేరుతో ఏర్పాటు

భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు

(ఆంధ్రజ్యోతి, భువనగిరి అర్బన): కలెక్టరేట్‌ ఆవరణలో క్యాంటీన ఏర్పాటుకు అధి కారులకలెక్టరేట్‌లో క్యాంటీను ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ‘మన ఉత్ప త్తులు- మన గౌరవం’ పేరుతో భవనంలో ఈ క్యాం టీనను అందు బాటులోకి తీసుకురానున్నారు. ఇప్ప టికే ఆ భవనాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు.కలెక్టరేట్‌లోని‘మన ఉత్పత్తులు- మనగౌరవం’ పేరు తో భవనంలో చేనేత వస్ర్తాలు, కూరగాయలు, చిరుతిట్లు, జావాను విక్రయించేవారు. అయితే వాటికి ఆదరణ లేక పోవడంతో కొద్ది రోజులకు మూత పడింది. దాంతో భవ నం నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ భవ నంలో కొత్త ఇందిరా మహిళా శక్తి భవనం పేరుతో క్యాంటీన ఏర్పాటు చేయనున్నారు. భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామానికి చెందిన మహిళా సమాఖ్య సభ్యులు ఆధ్వర్యంలో క్యాంటీన నిర్వి హంచనున్నారు. దాంతో పాత భవనానికే పేరు మార్పిడి చేసి కొత్త భవనంగా సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామీణ పేదరిక ని ర్మూలన సంస్థ సెర్ప్‌ ఆధ్వర్యంలో సభ్యులు క్యాంటీన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ. 20 లక్షలతో నిర్మించిన భవనాన్ని గత ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్‌ 12న ప్రారంభించారు. 2023 జూన మాసంలో తగినంత ప్రచారం లేక కాలక్రమేణా చిరువ్యాపారాలు తగ్గుముఖం పట్టి తాళం వేసే పరి స్థితి కి వచ్చింది. అప్పట్లో భవనం నిరుపయోగంగా ఉందని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. భోజనశాల ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు అధికారులు ఇది వరకే వెల్లడించారు. తిరిగి ఈ భవనం క్యాంటీనగా అందుబాటులో కి రానుంది. కానీ, కలెక్టరేట్‌ ఆవరణలోకి తలుపులు బిగించడంతో వ్యాపారం అంతగా లేనందున ప్రస్తుతం రోడ్డ్డువైపు తలుపులు ఏర్పాటు చేస్తే కొంత వ్యాపారం పుంజుకోవచ్చు.పల్లె జీవనశైలీ ప్రతిబింబించే విధంగా భవనం లోపల ఆకర్షణీయంగా వాల్‌ పేయి టింగ్‌, రైటింగ్‌ చేసినప్పటికి వ్యాపారాలు మాత్రం సాగ లేదు. వారం లోపు క్యాంటీనను ప్రారంభించనున్నట్లు డీఆర్డీవో తెలిపారు.

Updated Date - Nov 17 , 2024 | 12:57 AM