Share News

నల్లగొండ రైల్వేస్టేషనలో రూ.1.28కోట్ల నగదు పట్టివేత

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:06 AM

ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.28 కోట్ల నగదును నల్లగొండ జిల్లా రైల్వేపోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

నల్లగొండ రైల్వేస్టేషనలో రూ.1.28కోట్ల నగదు పట్టివేత
స్వాధీనం చేసుకున్న నగదుతో రైల్వే పోలీసులు

మిర్యాలగూడకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ట్రైజరీ కార్యాలయంలో నగదు అప్పగించనున్న ఆర్‌పీఎఫ్‌ అధికారులు

నల్లగొండ క్రైం, జూన 13:ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.28 కోట్ల నగదును నల్లగొండ జిల్లా రైల్వేపోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడకు చెందిన బంగారం వ్యాపారి హైదరాబాద్‌లో బంగారం కొనుగోలు చేసేందుకు మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు రెండు బ్యాగుల్లో నగదును తీసుకెళ్తున్న క్రమంలో నల్లగొండ రైల్వేస్టేషనలో ఆర్‌పీఎఫ్‌, రైల్వేపోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడకు చెందిన బంగారం వ్యాపారి తన వర్కర్‌తో కలిసి గురువారం ఫలక్‌నుమా రైల్‌లో నగదుతో హైదరాబాద్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా అందులో రూ.1,28,41,800 కోట్ల వరకు నగదు ఉన్నట్లు గుర్తించారు. ఐటీ అధికారుల సహాయంతో నగదును నల్లగొండ రైల్వేస్టేషనలో లెక్కించారు. ఈ నగదును ట్రెజరీ కార్యాలయానికి తరలించి అధికారులకు అప్పగించనున్నట్లు ఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు. ఈ నగదు విషయానికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఉండడంతో వివరాలు వెల్లడించేందుకు ఆలస్యం అవుతుందని ఆర్‌పీఎఫ్‌ పోలీసులు తెలిపారు. అయితే మిర్యాలగూడలో బంగారం దుకాణాల మధ్య ఉన్న పోటీతత్వంతో ఇతర వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకు నగదును ఆర్‌పీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మహేందర్‌, పరమే్‌షకు చెందిన నగదుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు శుక్రవారం తెలిపే అవకాశం ఉంది.

Updated Date - Jun 14 , 2024 | 12:06 AM