సామాజిక న్యాయం కోసం కులగణన
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:18 AM
సామాజిక న్యాయం కోసం కులగణన చేస్తున్నామని నీటి పారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల్లో ఆయన మాట్లాడా రు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ
మూసీ ప్రక్షాళనతో ఆయకట్టుకు నీరు
ప్రజాపాలన సంబరాల్లో మంత్రి ఉత్తమ్
హుజూర్‌నగర్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం కోసం కులగణన చేస్తున్నామని నీటి పారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల్లో ఆయన మాట్లాడా రు. కులగణనపై పలు పార్టీలు హామీలు ఇచ్చా యే గానీ సమగ్ర సర్వే చేయలేకపోయాయన్నా రు. కులగణన చేయగల దమ్ము కాంగ్రె్‌సకే ఉంద ని నిరూపించామన్నారు. రాష్ట్రంలో 90శాతం సర్వే పూర్తయిందన్నారు. కులగణ తర్వాత స్థానికసంస్థ ల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ముందుకు పోతామన్నారు. మంత్రివర్గ ఉప సంఘం, వన్ కమిషన్ సిఫారసుల మేరకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందన్నారు. వర్గీకరణ తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మూసీ ప్రాజెక్ట్ ప్రక్షాళన చేయడం ఎంతో అవసరమన్నారు. మూసీ ప్రాజెక్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తు న్న పథకాలపై ప్రతిపక్షాలు అర్థంలేని, పసలేని విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది ప్రజాపాలనలో 50వేల ఉద్యోగాలు భర్తీచేశామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 158లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. 21 లక్షల మంది రైతులకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లులేని వారికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. త్వరలో కొత్తగా రేషన్‌కార్డులు మంజూరుచేసి ప్రతీ వ్యక్తికి ఆరు కిలో సన్నబియ్యం ఇస్తామన్నారు. రైతులకు ఎంఎ్‌సపీతో పాటు బోనస్ రూ. 500ఇస్తున్నామన్నారు. జనవరి 10వరకు ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రైల్వేలైన్ ఏర్పాటుచేస్తామన్నారు. ఆరులేన్ల రహదారి నిర్మిస్తామన్నారు.
80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : కలెక్టర్
జిల్లాలో రూ.200కోట్ల విలువైన 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ అన్నారు. అందుకు సం బంధించి రైతులకు ఇప్పటికే రూ.100కోట్లకు పై గా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. మహిళలకు వివిధసంక్షేమ పథకాల కోసం రూ. 700కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నా రు. మోడల్ కాలనీ త్వరలోనే పూర్తి చేస్తామన్నా రు. రూ.200కోట్లతో రహదారులు, అంగన్‌వాడీ భవనాలు నిర్మిస్తున్నామన్నారు.రూ.335 కోట్లతో దివ్యాంగులకు పలుపథకాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో రూ.846కోట్లురుణమాఫీ జరిగిందన్నారు.కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్ పుంజాల అలేఖ్య, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, అదనపు కలెక్టర్ రాంబాబు, టూరిజం సంస్థ చైర్మన్ పటేల్ రమే్‌షరెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మున్సిపల్ చైర్మన్లు గెల్లి అర్చనరవి, ప్రమీల, ప్రకాశ్‌బాబు, కోతి సంపత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవీటిరామారావు, తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్న, సాముల శివారెడ్డి, ఓరుగంటి నాగేశ్వరరావు, గూడెపు శ్రీను, ఈడ్పుగంటి సుబ్బారావు, చావా సహదేవరావు, నిజాముద్దీన్, దొంగరి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణతో మఠంపల్లికి మహర్దశ
(ఆంధ్రజ్యోతి, మఠంపల్లి): హుజూర్‌నగర్ నుంచి మట్టపల్లి వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులతో మఠంపల్లి రూపరేఖలు మారనున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రూ.80కోట్లతో మట్టపల్లి-హుజూర్‌నగర్ రోడ్డు విస్తరణ పనుల పైలన్‌ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దులో మట్టపల్లి వద్ద రూ.50కోట్లతో వంతెన నిర్మించడంతో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగిందన్నారు. 24కిలోమీటర్ల రోడ్డు విస్తరణతో మట్టపల్లికి మహర్దశ కలుగుతుందన్నారు. అనంతరం రూ.10కోట్లతో చేపట్టనున్న చౌటపల్లి-మేళ్లచెరువు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, మంజూనాయక్, ఆధూరి స్రవంతికిషోర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, నవీన్‌నాయక్, బచ్చలకూరిబాబు, అప్పరావు, భీముడునాయక్, పిచ్చిరెడ్డి, గురవయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.