నేటి నుంచి సమగ్ర సర్వే
ABN , Publish Date - Nov 06 , 2024 | 01:24 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే బుధవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. జిల్లాలోని సుమారు 2.47 లక్ష ల కుటుంబాల నుంచి సుమారు 9లక్షల మం దికి చెందిన 75 వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు.
ప్రాథమిక పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటి పూట సెలవులు
విద్యార్ధులకు, అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు యధావిధిగా మధ్యాహ్న భోజనం
(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే బుధవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. జిల్లాలోని సుమారు 2.47 లక్ష ల కుటుంబాల నుంచి సుమారు 9లక్షల మం దికి చెందిన 75 వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు. ఈ సర్వే ఆధారంగా స్థాని క సంస్థల ఎన్నికల బీసీ రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో పాటు ప్రభుత్వం నూతనంగా చేపట్టే పథకాలకు ఆధారం కానుంది.ఈ సర్వే లో 1,939 మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. వీరి లో సుమారు 1,000 మంది ఎస్టీఈ ఉపాఽధ్యాయులు, 250 మంది బోధనేతర సిబ్బంది, 232 మంది అంగన్ వాడీ టీచర్లు, మిగతా 457 మంది మునిసిపల్, ఎంపీడీవో, తదితర స్థానిక సంస్థల సిబ్బంది ఉన్నారు.
కొన్ని పాఠశాలలకు ఒంటి పూట బడి
సర్వే కొనసాగే మూడు వారాల పాటు విధులు నిర్వహించే ఉపాధ్యాయులు ఒక్క పూట మాత్రమే పాఠశాలలకు వెళ్లనున్నారు. మిగతా పూట సర్వే విధుల్లో వారు పాల్గొంటారు. విధుల్లో లేని ఉపాధ్యాయులు సదరు పాఠశాలలను రెండు పూటలా నడిపిస్తారు. అయితే పాఠశాలలోని అంద రు ఉపాధ్యాయులు సర్వే విధుల్లో ఉంటే మాత్రం ఆయా పాఠశాలలు ఒంటిపూట మాత్రమే నడుస్తాయి. ఇదే అంగన్‌వాడీలకు సైతం వర్తించనుంది. జిల్లాలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అందులో 232 కేంద్రాలు ఒక్క పూటనే నడవనున్నాయి. జిల్లాలో 478 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా, సుమారు 16వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సర్వే విధు లు నిర్వహించనున్న 232 అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు 5,800 మంది లబ్ధిదారులు ఉన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది సర్వే విధుల్లో ఉంటే ఉదయం పూట పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను నడిపి మధ్యాహ్నం మూసివేస్తారు. ఆయా కేంద్రాల్లో మిగతా సిబ్బందికి సర్వే విధులు లేకుంటే మాత్రం సదరు పాఠశాలలు, అంగన్‌వాడీలను వారు రెండు పూటలా నడిపిస్తారు.
సర్వే సిబ్బందిని పెంచితే బాగుండేది
(5టౌన్ బియన్‌జి 1) రేపాక ఉమ, టీపీయూఎస్ జిల్లా అధ్యక్షురాలు
సర్వే సిబ్బంది సంఖ్యను పెంచితే సర్వే వ్యవధి, సర్వేలో పాల్గొంటున్న సిబ్బందిపై పని భారం తగ్గుతుంది. అలాగే ఒంటిపూట సెలవులు కూడా తగ్గి విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సర్వే సిబ్బంది పెంపుపై పునరాలోచన చేయాలి.
విద్యార్థులకు నష్టం కలగనీయం
(5టౌన్ బియన్‌జి 3) సత్యనారాయణ, డీఈవో
సర్వే కారణంగా కొన్ని ప్రాథమిక పాఠశాలలకు ఒంటి పూట సెలవులు ఉంటాయి. అయితే ఉదయం పూట ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లాల్సిందే. రెండు పూటల సిలబ్‌సను ఒక పూటలోనే బోధించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలి. మధ్యాహ్న భోజనం యథావిధిగా విద్యార్థులకు అందుతుంది. ఒంటి పూట సెలవులతో పెండింగ్‌లో ఉండే సిలబ్‌సను విద్యా సంవత్సరం ముగిసే లోపు పూర్తి చేస్తాం.