Share News

రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్‌

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:33 AM

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి గోడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

రైతుల గోడు పట్టించుకోని కాంగ్రెస్‌

కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన

భూదాన్‌పోచంపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి గోడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివా రం భూదాన్‌పోచంపల్లి, గౌసుకొండ, రేవణపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శంచి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవణపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తుందని ప్రకటించారని, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. అనేక హామీలతో అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్‌ ఇస్తామని చెప్పిన సీఎం నేడు కేవలం సన్న ధాన్యానికే బోనస్‌ అం టూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సపార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంద ని, రైతు డిక్లరేషన్‌ పేరుతో ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. వరి ధాన్యం మీద కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు అదనంగా రూ.500 ఇస్తానని వాగ్ధానాలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రంలోని 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 17లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కేవలం సీఎం రేవంత్‌రెడ్డి విధానాలకు మాత్రమే తాము వ్యతిరేకం అని అన్నారు. బోటు షికారు చేసిన సీఎంకు రైతుల కష్టాలు చూసేందుకు తీరిక లేదన్నారు.

రేవంత్‌రెడ్డి పచ్చి అబద్దాలకోరు

మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కేవలం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకే తాము వ్యతిరేకం అని కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన భూదాన్‌పోచంపల్లిలో విలేకరులతో మాట్లాడా రు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో అబద్దాల ప్రచారం చే స్తోందన్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని, అయితే పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్రమాల్లో నాయకులు కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, గూడూరు నారాయణరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పడమటి జగన్మోహన్‌రెడ్డి, సుర్కంటి రంగారెడ్డి, మేకల చొక్కారెడ్డి, కర్నాటి ధనుంజయ్య, పోతంశెట్టి రవీందర్‌, చిక్క కిష్ణ, ఎన్నం శివకుమార్‌, మహేందర్‌గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:33 AM