తెగని పంచాయితీ
ABN , Publish Date - Oct 18 , 2024 | 01:01 AM
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు, ఖరీదుదారుల నడుమ బస్తాల గొడవ కొలిక్కిరాలేదు.
అయోమయంలో రైతులు
శుక్రవారం మార్కెట్‌కు సెలవుపై సందిగ్ధం?
తిరుమలగిరి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు, ఖరీదుదారుల నడుమ బస్తాల గొడవ కొలిక్కిరాలేదు. బుధవారం మార్కెట్‌లో ఇరువర్గాల మధ్య ప్రారంభమైన బస్తాల పంచాయితీ గురువారం కూడా కొలిక్కిరాలేదు. ఎమ్మెల్యే మందుల సామేలు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మార్కెట్‌కు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో అయోమయంలో ఉన్న మార్కెట్ అదికారులు శుక్రవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించాలా? లేదా? అనే విషయంపై సందిగ్ధంలో పడ్డారు. మార్కెట్‌కు శుక్రవారం సెలవుపై అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా మార్కెట్‌లో పంచాయితీ వ్యవహారంతో రైతులు అయోమయంలో పడ్డారు. గురువారం సెలవు ఉన్నట్లు తెలియక మార్కెట్‌కు ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చారు ఈ ధాన్యాన్ని తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్ ఎదురుగా ఉన్న వ్యాపారులకు విక్రయించారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు పట్టించుకోలేదు.