ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విద్య
ABN , Publish Date - Jun 13 , 2024 | 12:13 AM
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం ఆలేరులోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ హనుమంతు కే.జెండగేతో కలిసి ప్రారంభించారు.
గ్రామీణ విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దాలి
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ఆలేరు రూరల్, జూన్ 12: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం ఆలేరులోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ హనుమంతు కే.జెండగేతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తయారు చేయడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తయారుచేసి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం రోజున ప్రభుత్వం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించడం శుభపరిణామమన్నారు. బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో 314 పాఠశాలలు ఉండగా 249 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా మార్చామన్నారు. రూ.11.29 కోట్లతో పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ హనుమంత్ కె జెండగే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పిన బెలూన్ల కథ పిల్లలను ఎంతగానో ఆకర్షించింది. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు స్థానిక డబుల్ బెడ్ రూం కాలనీని బీర్ల అయిలయ్య పరిశీలించారు. కాలనీవాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురికి నీరు ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషర్ లక్ష్మీ, తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డిలను ఆదేశించారు. ఆలేరు, గుండాల మండలాలకు చెందిన లబ్ధిదారులకు అయిలయ్య కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఈవో నారాయణరెడ్డి, జడ్పీవై్‌సచైర్మన్ బీకూనాయక్, ఎంపీపీలు గంధమల్ల అశోక్, చీర శ్రీశైలం, మునిసిపల్‌చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్‌చైర్మన్ మొరిగాడి మాధవి, హెచ్‌ఎం శ్యామ సుందరి, తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డి, ఎంఈవో జంగిటి కృష్ణ, ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేష్, తదితరులు ఉన్నారు.
బెస్ట్ అవైలబుల్ పథకం విద్యార్థుల ఎంపిక
బెస్ట్ అవైలబుల్ పథకం కింద గిరిజన అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్ నేతృత్వంలో విద్యార్థుల ఎంపిక బుధవారం జ రిగింది. మొత్తం 10 సీట్లకు 27 దరఖాస్తులకు 10మందిని డ్రాపద్ధతిన ఎంపిక చేశారు.
భువనగిరి రూరల్: సస్య రక్షణ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చునని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అన్నారు. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం రైతు వేదికలో బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం పంటల సాగుకు సంబంధించి క్రాప్ బుకింగ్, పంటల వివరాల నమోదుపై వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ, భువనగిరి, అలేరు, యాదగిరిగుట్ట, ఏడీఏలు భూక్య దేవ్‌సింగ్, వెంకటేశ్వర్‌రావు, పద్మావతి, ఏవో పావని ఉన్నారు.
కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్
బీబీనగర్: విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్ ఉం టుందని అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు. బుధవారం మండలంలోని జమీలాపేట జడ్పీహైస్కూల్‌లో నిర్వహించిన ప్రొఫెసర్ జ యశంకర్ బడిబాట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులు రాణిస్తున్నారంటే ఆ ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందన్నా రు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివా్‌సరెడ్డి, ఎం పీడీవో నాగవర్థన్‌రెడ్డి, నోడల్ అధికారి సురేశ్ రెడ్డి, గ్రామ పెద్దలు సుభాష్ రెడ్డి, పాండురంగం గౌడ్, శ్రీకాంత్‌యాదవ్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠశాల కమిటీ చైర్మన్ సునీత పాల్గొన్నారు.
స్వయంకృషితో లక్ష్యాలను చేరుకోవాలి : కలెక్టర్
భువనగిరి అర్బన్, జూన్ 12: విద్యార్థులు స్వయంకృషితో లక్ష్యాలను చేరుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హనమంతు కే.జెండగే సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్‌కు మంచి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పదికి పది జీపీఏ సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 68మంది విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగత వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రతీ విద్యార్థి దృష్టి సారించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే.గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. డీఈవో కే.నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థులకు స్ఫూర్తివంతమైందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదికి పది సాధించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర సభ్యుడు ఆర్. మహేందర్‌ఎడ్డి, సంస్థ జిల్లా చైర్మన్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, డివిజన్ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు కొడాలి వెంకటేశ్, జంపాల అంజయ్య పాల్గొన్నారు.