రాష్ట్రంలో కనిపించని ప్రజాస్వామ్య రక్షణ
ABN , Publish Date - Dec 17 , 2024 | 01:06 AM
ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్నిక ల్లో చేసిన ఏడో గ్యారెంటీ కాం గ్రెస్ పాలనలో ఎక్కడా కనిపించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చౌటుప్పల్ పట్టణంలో నిర్వహిస్తు న్న సీపీఎం జిల్లా మహాసభల సందర్భంగా సోమవారం జరిగిన ప్రతినిధుల సభలో తమ్మినేని పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
చౌటుప్పల్ టౌన్, డిసెంబ రు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్నిక ల్లో చేసిన ఏడో గ్యారెంటీ కాం గ్రెస్ పాలనలో ఎక్కడా కనిపించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చౌటుప్పల్ పట్టణంలో నిర్వహిస్తు న్న సీపీఎం జిల్లా మహాసభల సందర్భంగా సోమవారం జరిగిన ప్రతినిధుల సభలో తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసిన స్థానాల్లో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రె్‌సకు మద్ద తు ఇచ్చామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో సీపీఎం కార్యకర్తలను అరెస్టు చేశారని, కాంగ్రెస్ పాలనలో సైతం సీపీఎం కార్యకర్తల ను అరెస్టు చేస్తున్నారని, అందుకు ప్రజల తరపున పోరాడటమేనన్నా రు. ప్రజాస్వామ్యపరమైన అంశాలపై ప్రతిపక్షాలతో సంప్రదించడం లేదని, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రామగుండం అడవుల సమస్య, లగచ ర్ల భూముల సమస్య ప్రజాస్వామ్యం పరిధిలోకి రావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని, లోపాలను సరిదిద్దుకోవాలని అన్నారు. ఎన్నికల హామీలు నామ మాత్రంగానే అమలయ్యాయని, ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, రాష్ట్రాల శక్తి ని తగ్గిస్తుందని అన్నారు. ఇది దేశానికి ఎంత మాత్రం క్షేమం కాదని, అందుకే దీన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అదానీ కుంభకో ణం బయటికి వచ్చినా, అమెరికాలో కేసు నమోదైనా, ఏపీతో పాటు గోవా, జమ్ముకశ్మీర్ ప్రభుత్వాలకు అదానీ లంచాలు ఇచ్చినట్టు వార్తలు వచ్చినా కేంద్రం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దావో్‌సలో సీఎం రేవంత్‌రెడ్డి, అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల సోలార్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని బహిర్గతం చేయడంతో పాటు దాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసమే ఏపీ గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అదానీ రూ.1,750కోట్ల లంచాలు ముట్టినట్టు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు నిర్ధారించాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100కోట్లు విరాళాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వాపస్ చేయడం సంతోషకరమన్నారు. అంతకుముందు జరిగిన ప్రతినిధుల సభలో మాట్లాడుతూ, పాలకుల తప్పిదాలను ఎత్తి చూపడమే సీపీఎం లక్ష్యమని, తమ నేతల, కార్యకర్తల అక్రమ అరెస్టులు కొత్తేమీ కాదని అన్నా రు. నిర్బంధాలు పెరిగే కొద్దీ ఉద్యమాలు మరింతగా బలపడతాయని, పేద వర్గాల సమస్యలే ఎర్రజెండా ఎజెండా అని అన్నారు. పాలకులు అ నుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలని, భవిష్యత్ ఉద్యమాలకు కార్యాచరణ రూ పొందించాలని అన్నారు. కార్యక్రమాల్లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చె రుపల్లి సీతారాములు, నాయకులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్, బి.చంద్రారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, కె.నర్సింహ, బి.అనురాధ, ఎం.నర్సింహులు, కె.మల్లెశం, ఎం.బాలరాజు, డి.నర్సిరెడ్డి, డి.పాండు, మేక అశోక్‌రెడ్డి, బి.కృష్ణారెడ్డి, ఎండీ.పాషా, బం డారు నర్సింహ, గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్, దండ అరుణ్‌కుమార్, పల్లె మధు, బి.వెంకటేశ్, రాగీరు కిష్టయ్య, పాల్గొన్నారు.
నిర్వాసితులకు భూమి ఇవ్వాలి
(ఆంధ్రజ్యోతి, భూదాన్‌పోచంపల్లి): గౌరెల్లి-భద్రాచలం రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి సీపీఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి వినతిపత్రం అందజేశారు. లేదా ఓపెన్ మార్కెట్ ధర ప్రకారం రైతులకు పరిహారం చెల్లించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దుబ్బాక జగన్, గూడూరు అంజిరెడ్డి, ప్రసాదం విష్ణు, మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి, నెలకంటి జంగయ్య, పత్తి భిక్షపతి, సామ జంగారెడ్డి, బుగ్గ లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.