Share News

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:12 AM

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్ట ర్‌ ఎం.హనుమంతరావు అధికారులను హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

కలెక్టర్‌ హనుమంతరావు

పలు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు

గుండాల పీఏసీఎస్‌ సీఈవో సస్పెన్షన్‌

మరో ఐదుగురికి షోకాజ్‌

గుండాల, ఆలేరు రూరల్‌, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్ట ర్‌ ఎం.హనుమంతరావు అధికారులను హెచ్చరించారు. శుక్రవారం గుండాల తహసీల్దార్‌ కార్యాల యం, ధాన్యం కొనుగోలు కేంద్రం, ప్రాథమిక ఆరో గ్య కేంద్రం, ఆలేరు మండల పరిషత్‌ కార్యాల యం, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, అడ్డగూడూరు పీహెచ్‌సీని, ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ని సబ్‌ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మోత్కూరు తహసీల్దార్‌ కార్యాలయం, మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీచేశారు. గుం డాలలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమశాతం కొలిచే యంత్రం, టార్పాలిన్లు లేకపోవడంతో పీఏసీఎస్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌ సీఈవోకు ఫోన్‌ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో సస్పెండ్‌ చేయాలని డీసీవో శ్రీధర్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఏఈవో క్రాంతికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. నలుగురు సిబ్బంది పీహెచ్‌ఎన్‌ వనజ, సీహెచ్‌ఓ వెంకటేష్‌, సూపర్‌వైజర్‌ కరుణ, స్టాఫ్‌నర్స్‌ పార్వతి ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవడంతో వారికి షోకాజ్‌ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మండల వైద్యాధికారి హైమావతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీచేసి ధరణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహసీల్దార్‌ జలకుమారిని ఆదేశించారు. ఆలేరు మండల పరిషత్‌ కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీచేశారు. ఉదయం 9గంటలు దాటినా అధికారులెవ్వరూ విధులకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని మండల స్పెషల్‌ ఆఫీసర్‌ గోపాల్‌కు నోటీసులు జారీ చేయాలని అదేశించారు. సీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ స్వప్న రాథోడ్‌, డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ రజిని డాక్టర్‌ స్వప్నకు షోకాజ్‌ జారీ చేయాలని డీసీహెచ్‌ఎ్‌స చిన్నా నాయక్‌ను ఆదేశించారు. అడ్డగూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పారిశుధ్యం నిర్వహణ మెరుగ్గా ఉండటంతో డాక్టరు ప్రవీణ్‌ను సన్మానించారు. మండలంలోని ధర్మారం గ్రామంలో ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవసాయ క్షేత్రంలో వరి కొతలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఎమ్మెల్యే మందుల సామేలు శాలువాతో సన్మానించారు. అనంతరం ఇటీవల బిక్కెరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంమ్‌ను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. ఆత్మకూరు(ఎం) సబ్‌ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు.

ధాన్యం లేక వెలవెలబోయిన మోత్కూరు మార్కెట్‌

(ఆంధ్రజ్యోతి, మోత్కూరు): మోత్కూరు తహసీల్దార్‌ కార్యాలయాన్ని, మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పాథమిక పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ హనుమంతరావు తనిఖీ చేశారు. మార్కెట్‌లో ధాన్యం రాశులు లేక వెలవెలబోయిన కొనుగోలు కేంద్రాన్ని, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని చూసి ఎందుకు ఇలా ఉన్నాయని ప్రశ్నించారు. తొలుత తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను తనిఖీచేశారు. అనంతరం మార్కెట్‌ యార్డును తనిఖీచేశారు. మార్కెట్లో ఐదారు సన్న ధాన్యం రాశులే ఉండటంతో ఇదేంటని ప్రశ్నించగా, సన్న ధాన్యం వరి సాగు తక్కువగా ఉందని, కొందరు రైతులు ఇంటికి అవసరమైనంత ఉంచుకొని మిగతా ధాన్యం విక్రయించారని రైతులు వివరించారు. మార్కెట్‌ కార్యదర్శి విధులకు రాకపోవడాన్ని ప్రశ్నించారు. 17 శాతం తేమ ఉన్నా ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించి వెంటనే వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఇద్దరే పిల్లలే ఉండటాన్ని కలెక్టర్‌ ప్రశ్నించారు. మొత్తం నలుగురు పిల్లలు కాగా, దీపావళి పండుగ కావడంతో ఇద్దరు రాలేదని అంగన్‌వాడీ టీచర్‌ శోభ వివరించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు ఉన్నారు.

4న బీసీ కమిషన్‌ పర్యటన

భువనగిరి కలెక్టరేట్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈనెల 4న బీసీ కమిషన్‌ పర్యటించనున్నట్టు కలెక్టర్‌ ఎం.హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్‌లో ఉద యం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే సమావేశంలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారన్నారు. బీసీ సంఘాలు, బీసీ కులస్థులు,ఇతరులు ఫిర్యాదులను రాతపూర్వకంగా ఇవ్వవచ్చని తెలిపారు. అక్కడ జరిగే సమావేశంలో జిల్లాకు సంబంధించిన ఫిర్యాదులను మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు తీసుకుంటారని తెలిపారు. ఆ రోజున ఫిర్యాదు చేయని వారు ఈ నెల 12న హైదరాబాదులోని బీసీ కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Updated Date - Nov 02 , 2024 | 01:12 AM