ఆలయాలకు ధనుర్మాస శోభ
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:39 AM
జిల్లాలోని ఆలయాలు ధనుర్మాస శోభను సంతరించుకున్నాయి. 12 రాశుల్లో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. ఈ మాసానికి మార్గళి లనే మరో పేరుకూడా ప్రాచూర్యంలో ఉంది.
నేటి నుంచి ఽమట్టపల్లిలో ధనుర్మాసోత్సవాలు
మఠంపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆలయాలు ధనుర్మాస శోభను సంతరించుకున్నాయి. 12 రాశుల్లో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. ఈ మాసానికి మార్గళి లనే మరో పేరుకూడా ప్రాచూర్యంలో ఉంది. వైష్ణవ క్షేత్రాల్లో మార్గళి ఉత్సవాలను ఈనెల 16 నుంచి జనవరి 14వరకు నిర్వహిస్తారు. ఈ మాసంలో మహిళలు ధనుర్మాస వ్రత దీక్షలు ఆచరిస్తారు. ఈ మాసమంతా తెల్లవారుజామునే అమ్మవారికి అష్టోత్తర శత నామావళి, తులసిమాల కైంకర్యం, గోదా విరచితమైన 30 పాశురాల పఠనం చేస్తారు. సాయంత్రం పుష్పాలంకరణలు, కుంకుమార్చనలు, పల్లకి సేవ నిర్వహిస్తారు. 30 పాశురాలను 30 రోజులు పఠిస్తారు. జనవరి 11న జరిగే కుడారై ఉత్సవంలో 108 కాంస్య పాత్రల్లో నెయ్యి, తదితరాలతో తయారు చేసిన పాయసం నివేదిస్తారు. 14వ తేదీన గోదాదేవి రంగనాథుడి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
మేళ్లచెర్వు: ధనుర్మాస వేడుకలకు గ్రామంలో ప్రధాన ఆలయమైన భూనీల సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీరామ మందిరాలు సిద్ధయ్యాయి. ప్రతీ రోజు తెల్లవారు జామున 4నుంచి 5 గంటల వరకు స్వామి వారి అర్చన, తిరుప్పావై సేవ, భజన కార్యక్రమాలు, సాయంత్రం 7గంటల నుంచి కుంకుమార్చనలు, భజన కోలాటాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు రంగభట్టాచార్యులు, ఈవో శంభిరెడ్డి తెలిపారు.