కాలినడక భక్తులకు నేరుగా దర్శనం
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:17 AM
శబరిమలకు కాలినడకన వెళ్లే భక్తులకు క్యూలో నిలబడకుండా నేరుగా అయ్యప్పస్వామి దర్శనం చేసుకునే సౌకర్యాన్ని కేరళ ప్రభుత్వం కల్పించిందని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కేంద్ర కమిటీ అధ్యక్షుడు రాజు దేశ్పాండే, ఆర్గనైజింగ్ కార్యదర్శి యాదయ్య, ప్రచార కార్యదర్శి సోము, పూల గురుస్వామి తెలిపారు.
నల్లగొండ, కల్చరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): శబరిమలకు కాలినడకన వెళ్లే భక్తులకు క్యూలో నిలబడకుండా నేరుగా అయ్యప్పస్వామి దర్శనం చేసుకునే సౌకర్యాన్ని కేరళ ప్రభుత్వం కల్పించిందని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కేంద్ర కమిటీ అధ్యక్షుడు రాజు దేశ్పాండే, ఆర్గనైజింగ్ కార్యదర్శి యాదయ్య, ప్రచార కార్యదర్శి సోము, పూల గురుస్వామి తెలిపారు. ఆదివారం నల్లగొండలోని అయ్యప్ప సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని 2022 ఏప్రిల్‌లో కేంద్ర కమిటీ ద్వారా కేరళ సీఎంకు వినతిపత్రం సమర్పించామన్నారు. అందుకు స్పందనగానే ఈ ఏడాది అమలుచేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా శబరిమలకు వెళ్లే అయ్యప్పమాలధారణ స్వాములకు రూ.5లక్షల ఉచిత ప్రమాద బీమ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా పిల్లలకు, స్త్రీలకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన ద్వారా స్వామి వారి దర్శనానికి దేవస్థానం బోర్డు అనుమతి ఇచ్చిందన్నారు. సమావేశంలో సంస్థ కార్యవర్గ సభ్యులు పుట్టబోతుల కృష్ణమూర్తి, కందగట్ల విఠల్, కోట శ్రీనివాస్, బిక్షమయ్య, నిఖిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.