Share News

సబ్‌స్టేషనతో చదువులకు ఆటంకం

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:46 AM

పాఠశాల అంటేనే ఓ భరోసా..విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే ఆలయం..తమ పిల్లలు పాఠశాలలో భద్రతగా ఉంటారని విద్యార్థుల తల్లిదండ్రల విశ్వాసం..

సబ్‌స్టేషనతో చదువులకు ఆటంకం

భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు

ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్‌

యాదగిరిగుట్ట రూరల్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పాఠశాల అంటేనే ఓ భరోసా..విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే ఆలయం..తమ పిల్లలు పాఠశాలలో భద్రతగా ఉంటారని విద్యార్థుల తల్లిదండ్రల విశ్వాసం.. అలాంటి పాఠశాల ప్రహరీలోపల పాఠశాల భవనం వెనుకభాగంలో విద్యుత సబ్‌స్టేషన ఉండడం.. అందులోనుంచి తరచూ శబ్దాలు వస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవతున్నారు. ఇది ఎక్కడో కాదు.. యాదగిరిగుట్ట పట్టణంలోనే..

యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో అందరికీ అందుబాటలో ఉన్న ఉన్న బాలుర, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల స్థలం ఉండేది. 15సంవత్సరాల క్రితం ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల అనాలోచినతమైన నిర్ణయాలతో స్థలాన్ని దేవస్థానానికి అప్పగించారు. పాఠశాలలను నియమ నిబంధనలను గాలికి వదిలి.. విద్యార్థులకు అసౌకర్యాల నడుమ పాఠశాలలను నిర్మించారు. పాఠశాలల ప్రహరీ లోపలే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పా టు చేశారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఎప్పుడు ఏ ఏప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. విద్యుత సరఫరా అయ్యే క్రమంలో ధ్వని కాలుష్యం, రేడియేషన్‌తో ప్రమాదం పొంచి ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పాఠశాల ప్రహారి లోపల మరుగుదొడ్ల నిర్మాణానికి ఎక్స్‌కవేటర్‌తో గుంతలు తీస్తున్న సమయంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సరఫరా కోసం భూమిలో ఉన్న వైర్లు ఎక్స్‌కవేటర్‌ పనులు చేస్తుండగా వైర్లు తేలగా డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండకుంటే పెద్దప్రమాదం జరిగిఉండేది. అయినప్పటి విద్యుత్‌ అధికారులు మాత్రం తమ వైర్లను ధ్వంసం చేశారని దానికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై ఒత్తిడి తీసుకురావడంతో ఆమె ప్రజా ప్రతినిధులను ఆశ్రయించడంతో డబ్బులు కట్టకుండా నిలిపివేశారు.

దుర్వాసన వెదజల్లుతున్నా చర్యలేవీ?

లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి పాఠశాలకు కూతపెట్టు దూరంలోనే మొక్కులు తీర్చుకవడానికి మేకలు, గొర్రెలను బలి ఇస్తుంటారు. వాటి ద్వారా వచ్చే వ్యర్ధాలను సమీపంలోనే పడేస్తుంటారు. అవికుల్లిపోయి దుర్వాసన వస్తుండడం విద్యార్థులకు సమస్యగా మారింది. తరగతి గదుల్లో కూర్చోవడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు గొర్రెలు, మేకల వ్యర్థాలను పాఠశాలలకు దూరంగా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు ఆలయం నుంచి మైకుల ద్వారా వచ్చే ధ్వని సైతం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సమీపంలోనే శ్మశాన వాటిక ఉండడం.. ఎవరైనా మృతి చెందితే వచ్చే వాయిద్యాల శబ్దాలు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికైనా సమస్యల వలయంలో ఉన్న రెండు పాఠశాలల విషయంలో ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి ప్రశాంత వాతావరణం పాఠశాలలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

తరగతి గదిలో కూర్చోవాలంటే భయంగా ఉంది

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పాఠశాల ప్రహారి లోపల ఉండటంతో తరగతి గదిలో కూర్చోవాలంటే భయం భయంగా ఉంది. విద్యుత్‌ సరఫరా అయ్యే సమసయంలో అప్పుడప్పుడూ వచ్చే శబ్దాలతో భయపడుతున్నాం. చదువుపై దృష్టి సారించ లేకపోతున్నాం.

-రాజు, పాఠశాల విద్యార్థి, యాదగిరిగుట్ట

పాఠశాలలను పాత స్థలంలోకే మార్చాలి

గత ప్రభుత్వం బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను గోశాలకు తరలించి పెద్ద తప్పుచేశారు. అసౌకర్యంగా ఉన్న పాఠశాలలను పాత స్థలంలోనే పునర్నింర్మించాలి. గోశాల పాఠశాలలు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, భక్తులు మొక్కుల చెల్లించుకున్న జీవాల మాసం వ్యర్థాలు, శ్మశానవాటిక, ఆలయం ధ్వుణులు, దారిలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత పాఠశాలలను తక్షణమే పాత స్థలంలోకి మార్చాలి.

-కల్లేపల్లి మహేందర్‌, యాదగిరిగుట్ట మండలం

వైర్లు తేలినమాట వాస్తవమే

ఇటీవల విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మాణం చేయడానికి పాఠశాల ప్రహరీలోల ఎక్స్‌కవేటర్‌ ద్వార గుంతలు తీస్తుండగా సబ్‌స్టేషన్‌ వైర్లు తేలాయి. డ్రైవర్‌ అప్రమత్తత కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. వైర్లు తేలినందుకు సబంధిత అధికారులు తమను డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చిరు. ప్రజా ప్రతినిధుల సహకారంతో సమస్య సద్దుమనిగింది.

-శరత్‌యామిని, ఎంఈవో, యాదగిరిగుట్ట మండలం

Updated Date - Nov 14 , 2024 | 12:46 AM