Share News

పోటాపోటీగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

ABN , Publish Date - Oct 30 , 2024 | 12:13 AM

నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలకేంద్రంలో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు పోటాపోటీగా సాగాయి.

 పోటాపోటీగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
ప్రథమ బహుమతి సాధించిన నల్లగొండ కబడ్డీ జట్టు

తిరుమలగిరి(సాగర్‌), అక్టోబరు 29 (ఆంరఽఽధజ్యోతి) : నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలకేంద్రంలో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు పోటాపోటీగా సాగాయి. పోటీల్లో మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ డివిజన్లకు చెందిన సుమారు 300 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. అండర్‌ -17 బాలుర విభాగంలో నల్లగొండ డివిజన జట్టు ప్రథమ స్థానాన్ని, మిర్యాలగూడ డివిజన జట్టు రెండో స్థానాన్ని, బాలికల విభాగంలో మొదటి స్థానాన్ని మిర్యాలగూడ, రెండో స్థానంలో నల్లగొండ డివిజన నిలిచింది. అండర్‌-14 బాలుర విభాగంలో మొదటి స్థానాన్ని దేవరకొండ, రెండో స్థానంలో మిర్యాలగూడ డివిజన్లు నిలవగా, బాలికల విభాగంలో మొదటి స్థానంలో దేవరకొండ, రెండో స్థానంలో నల్లగొండ డివిజన నిలిచాయి. ఆయా విభాగాల జట్ల నుంచి ఏడుగురు చొప్పున ఎంపిక చేసి జిల్లా జట్టును ఏర్పాటు చేయనున్నారు. నవంబరు 2న యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయా జట్లు పాల్గొంటాయని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి దగ్గుబాటి విమల, మిర్యాలగూడ డివిజన సెక్రటరీ కోడుమూరు వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.

క్రీడలతో మానసిక స్థైర్యం

క్రీడల ద్వారా విద్యార్థులకు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందుతుందని హాలియా మార్కెట్‌ కమిటీ చైర్మన తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన ఆఽధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్‌-14, 17 కబడ్డీ పోటీలను ఆయన జడ్పీ మాజీ వైస్‌చైర్మన కర్నాటి లింగారెడ్డితో కలిసి ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కాగా మండల కాంగ్రెస్‌ నాయకుడు పగడాల సైదులుయాదవ్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులకు భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వీరశేఖర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన కలసాని చంద్రశేఖర్‌, నాయకులు ఆంగోతు భగవాననాయక్‌, రమావత కృష్ణానాయక్‌, శాగం లింగారెడ్డి, శాగం శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పిట్టల కృష్ణ, రమావత లాలునాయక్‌, శాగం నాగిరెడ్డి, శాగం అంజిరెడ్డి, పిట్టల తిరుమల్‌, శ్రీధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:13 AM