Share News

క్రిస్మస్‌ వేడుకలకు జిల్లా ముస్తాబు

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:03 AM

క్రిస్మస్‌ వేడుకలకు జిల్లా ముస్తాబు అయింది. క్రిస్టియన్లు రెండు రోజులపాటు జరగనున్న వేడుకలలో బుధవారం క్రిస్మస్‌ గురువారం బాక్సింగ్‌డేను జరుపుకోనున్నారు.

క్రిస్మస్‌ వేడుకలకు జిల్లా ముస్తాబు
భువనగిరిలో క్రిస్మస్‌ వేడుకలు ముస్తాబైన చర్చి

శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

భువనగిరి టౌన, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ వేడుకలకు జిల్లా ముస్తాబు అయింది. క్రిస్టియన్లు రెండు రోజులపాటు జరగనున్న వేడుకలలో బుధవారం క్రిస్మస్‌ గురువారం బాక్సింగ్‌డేను జరుపుకోనున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో క్రిస్మస్‌ సందడి నెలకొనగా చర్చిలను విద్యుతదీపాలు, పువ్వులు తదితర సామగ్రితో అలంకరించారు. రెండు రోజులపాటు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, సువార్త కూటములు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మత పెద్దలు ఏసుక్రీస్తు జీవనంపై మాట్లాడతారు. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్‌, మోత్కూర్‌, పోచంపల్లి పట్టణాలతో పాటు క్రిస్టియన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో క్రిస్మస్‌ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ఇండ్లపై స్టార్‌ గుర్తులకు ఏర్పాటు చేశారు. భువనగిరిలో మంగళవారం పాస్టర్‌ రెవరెండ్‌ స్టాన్లీ ఆధ్వర్యంలో పేదలకు పండుగ సామాగ్రి పంపిణీ చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో కూడా దుస్తులు, సామాగ్రి పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ ఎం హనుమంతరావు, డీసీపీ ఎం రాజే్‌షచంద్ర క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 25 , 2024 | 01:03 AM