Share News

ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగ

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:22 AM

జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలను చిన్నా, పెద్దా ఆనందంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగ
సూర్యాపేటలో బాణసంచా కాలుస్తున్న పటేల్‌ రమేష్‌రెడ్డి, ఆర్టీసీ బస్టాండ్‌లో పూలు, దీపాలతో అలంకరణ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలను చిన్నా, పెద్దా ఆనందంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఇంటిని పూలతో, దీపాలతో అలంకరించారు. ఇంటి ఆడపడుచులు గురువారం వేకువజామునే మంగళహారతులు ఇచ్చారు. దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక అర్చనలు, పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు బాణసంచా వెలుగులు ఆకాశంలోని చీకట్లను మరిపించాయి. సూర్యాపేటలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి బాణసంచా కాల్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిలుకూరు మండలంలోని జానకీనగర్‌లో పలు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ పాల్గొన్నారు. సూర్యాపేట, కోదాడ బస్‌స్టేషనలలో ముగ్గులు వేసి దీపాలతో అలంకరించారు.

Updated Date - Nov 02 , 2024 | 01:22 AM