Share News

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు కలిగించవద్దు

ABN , Publish Date - Mar 19 , 2024 | 01:10 AM

రైతులు మిల్లు పాయింట్ల వద్దకు తెచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నా రు. సోమవారం రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవన్‌లో మిల్లర్లతో ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు.

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు కలిగించవద్దు

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, మార్చి 18: రైతులు మిల్లు పాయింట్ల వద్దకు తెచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నా రు. సోమవారం రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవన్‌లో మిల్లర్లతో ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యాసంగి వరికోతల ప్రారంభ సమయంలో క్వింటా సన్నధాన్యానికి రూ.2,700 ధరకు కొనుగోలు చేసిన మిల్లర్లు ప్రస్తుతం రూ.2250-రూ.2300 వరకు మాత్రమే చెల్లిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారని అన్నారు. కొన్ని మిల్లులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని, మిల్లర్లంతా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. దిగుమతి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌, మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో ప్రత్యేక మొబైల్‌ బృందాన్ని ఏర్పాటు చేసి దిగుమతుల్లో జాప్యం లేకుండా చూస్తామని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్‌పో్‌స్టల వద్ద తనిఖీ బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రైతుల సమస్య పరిష్కారం కాకుంటే టోకెన్‌ విధానం అమల్లోకి తెస్తామన్నారు.

Updated Date - Mar 19 , 2024 | 01:10 AM