యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:26 AM
మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని నూతన వీసీ అల్తాఫ్ హుస్సేన అన్నారు. శనివారం వీసీ(ఉపకులపతి)గా బాధ్యతలు స్వీకరించారు.
ఎంజీయూ నూతన వీసీ అల్తాఫ్ హుస్సేన
నల్లగొండ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని నూతన వీసీ అల్తాఫ్ హుస్సేన అన్నారు. శనివారం వీసీ(ఉపకులపతి)గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూని వర్సిటీ అభివృద్ధి కోసం ఆచార్యులతో పాటు నానటీచింగ్, నాల్గో తరగతి ఉద్యోగుల సహకారంతో పాటు ప్రభుత్వం సహకారంతో యూనివర్సిటీని ఉన్నతంగా తీర్చిదిద్దుతానన్నారు. గతంలో 2016 నుంచి 2019 వరకు వీసీగా పనిచేశానని, అప్పుడు కూడా నైపుణ్యాలన్నింటిని ఉపయోగించి యూనివర్సిటీ అభివృద్ధి కోసం శ్రమించానన్నారు. మరొకసారి తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్సిటీలో మెరుగైన ఉన్నతవిద్యకు కృషి చేస్తానన్నారు. సూక్ష్మస్థాయి పరిశీలన, నైపుణ్యాల పెంపు సారూప్యత ఉన్న విభాగాల సంఘటిత కార్యాచరణ, పరస్పర సహకారాలు, నైపుణ్య అభివృద్ధి అవసరమన్నారు. అన్నిశాఖల అధికారులు, అధ్యాపకులతో చర్చించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో రిజిసా్ట్రర్ ఆచార్య అల్వాల రవి, ఓఎ్‌సడీ కొప్పుల అంజిరెడ్డి, సీవోఈ ఉపేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ అరుణప్రియ, మారం వెంకటరమణారెడ్డి, ప్రేమ్‌సాగర్, సుధారాణి, అధికారి మిర్యాల రమేష్, దోమల రమేష్, అన్నపూర్ణ, రేఖ, రూప, వసంత, మాధురి, సబీనా హెరాల్డ్‌తో పాటు అధ్యాపకులు, బోధనేంతర సిబ్బంది పాల్గొన్నారు.