Share News

రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎస్పీ

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:30 AM

రక్తదానంతో ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చని ఎస్పీ సనప్రీతసింగ్‌ అన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎస్పీ
పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదానం చేస్తున్న ఎస్పీ సనప్రీతసింగ్‌

సూర్యాపేట క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : రక్తదానంతో ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చని ఎస్పీ సనప్రీతసింగ్‌ అన్నారు. శనివారం పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మాట్లాడారు. పోలీసుల త్యాగాలు, బలిదానాలను ప్రజలు గుర్తించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎంతోమంది అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిబిరంలో 200 మంది యువత రక్తదానం చేశారు.

పోలీస్‌ కుటుంబాలకు అండగా భద్రతపథకం

పోలీస్‌ కుటుంబాలకు అండగా పోలీస్‌ భద్రత పథకం నిలుస్తోందని ఎస్పీ సనప్రీతసింగ్‌ అన్నారు. ఇటీవల మృతి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వర్‌రావు కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో భద్రత పథకం ద్వారా మంజూరైన రూ.8లక్షల చెక్కును అందజేసి,మాట్లాడారు.

జిల్లా జాగిలాలకు ద్వితీయ స్థానం

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌లో జిల్లాకు చెందిన పోలీస్‌ జాగిలాలు ద్వితీయ స్థానం సాధించాయయని ఎస్పీ సనప్రీతసింగ్‌ అన్నారు. నల్లగొంగ జిల్లా జాగిలాలతో కలిసి ద్వితీయ స్థానం సాధించాయన్నారు. జాగిలాల పర్యవేక్షకులు జాగిలాల పర్యవేక్షకులు నరేష్‌, సతీ్‌షలను ఎస్పీ అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు ఎస్పీలు మేక నాగేశ్వర్‌రావు, జనార్ధనరెడ్డి, డీఎస్పీలు రవి, నర్సింహాచారి, ఆర్‌ఐ నారాయణరాజు, సీఐలు గురుకుల రాజశేఖర్‌, సురేందర్‌రెడ్డి, శ్రీనునాయక్‌, రఘువీర్‌రెడ్డి, నారాయణరాజు, చిరంజీవి యువత అసోసియేషన రాష్ట్ర నాయకుడు బైరు వెంకన్నగౌడ్‌, ఎస్‌బీఐ వీరరాఘవులు,పోలీస్‌ సంక్షేమసంఘం ప్రతినిధులు గునగంటి వెంకన్న, విజయ్‌ ఉన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:30 AM