ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
ABN , Publish Date - Nov 03 , 2024 | 12:46 AM
రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మండలంలోని ధర్మారం, అడ్డగూడూరు, డి.రాపాక, చౌళ్లరామారం, కోటమర్తి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మందుల సామేలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని దళరులకు విక్రయించవద్దని ఈ కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. సన్నధాన్యాన్నికి ప్రభుత్వం అందించే రూ, 500 బోనసును రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా రైతుల ధాన్యం దండి కోట్టీ రైస్ మిల్లర్లతో మీలకతై రైతుల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేయవద్దని ఐకేపీ నిర్వాహకులను ఆయన హెచ్చరించారు. ఈ కేంద్రాల్లో ఉండే నిర్వాహకులు రైతులను మోసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. సీఎం రేవంతరెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలన వచ్చిందని అన్నారు. అలాగే అడ్డగూడూరు మండలానికి ఐటీఐ కళశాలకు మాంజూరు అయిందని అన్నారు. ఈ నియోజకవర్గనికి సుమారుగా నాలుగు వేల వేల ఇందిరమ్మ ఇళ్లు మాంజూరు అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన కొప్పుల నిరంజనరెడ్డి, వైస్ చైర్మన చేడే చంద్రయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య, మాజీ సర్పంచ నిమ్మనగోటీ జోజి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇటికాల చిరంజీవి, పాశం సత్యనారాయణ, లింగాల నర్సిరెడ్డి, వళ్లంభట్ల ర వీందర్, గుండిగా జోసఫ్, బాలెంల విద్యసాగర్, కడారి రమేష్ ఉన్నారు.