Share News

విద్యా వ్యవస్థను పరిరక్షించాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:57 AM

విద్యా వ్యవస్థను పరిరక్షించాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ఆరో విద్యా వైజ్ఞానిక మూడు రోజుల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. విద్య ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని, ఒక కుటుంబంలో ఒక్కరు విద్యావంతులైతే ఆ కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి చెందుతారన్నారన్నారు.

విద్యా వ్యవస్థను పరిరక్షించాలి

మూఢ నమ్మకాలను పెంచే విద్యా విధానం ప్రమాదకరం

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

సమాజంలో పెరుగుతున్న అంతరాలు : కే.నాగేశ్వర్‌

నల్లగొండలో ప్రారంభమైన టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ఆరో మహాసభలు

నల్లగొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థను పరిరక్షించాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ఆరో విద్యా వైజ్ఞానిక మూడు రోజుల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. విద్య ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని, ఒక కుటుంబంలో ఒక్కరు విద్యావంతులైతే ఆ కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి చెందుతారన్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 18.5లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, అనేక కారణాలతో డ్రాపవుట్స్‌ పెరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయన్నా రు. పారిశుధ్య కార్మికులు, కాపలాదారులు లేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పాఠశాలలు ఉండేవని, ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను నియమించిందన్నారు. నూతన డీఎస్సీ ద్వారా 10 వేలకు పైగా కొత్త ఉపాధ్యాయులు వచ్చారని, రెసిడెన్షియల్‌, మో డల్‌ స్కూళ్లలో మరో 10వేల మంది నియమితులయ్యారన్నారు. పదోన్నతులు, బదిలీల సమస్య కాంగ్రెస్‌ హయాంలోనే పరిష్కారమైందన్నారు. 317జీవోలో సమస్యలున్నాయని, డిసెంబరు 31లోపు స్పౌజ్‌ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉందన్నారు. టీఎ్‌సయుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ఇన్‌చార్జీల పాలనలో విద్య వ్యవస్థను సరిదిద్దాలన్నారు. కొత్త ప్రభుత్వం బదిలీలు, ప్రమోషన్ల సమస్య తీర్చిందన్నారు. రాష్ట్రంలో 22జిల్లాలకు డీఈవోలు లేరని, 63మంది డిప్యూటీ డీఈవోలు లేరన్నారు. 640 మంది మండలాల్లో కేవలం మాత్రమే 14మంది రెగ్యూల ర్‌ ఎంఈవోలు ఉన్నారన్నారు.

మూఢ నమ్మకాలను పెంచే విద్యావిధానం ప్రమాదకరం : నర్సిరెడ్డి

మత విశ్వాసాలు, మూఢనమ్మకాలను పెంచే విద్యావిధానం ప్రమాదకరమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న చరిత్ర నల్లగొండ జిల్లాకు ఉందన్నారు. మట్టి పిసికే చేతులే పోరాటాలు చేశాయని, వీరనారి చాకలి ఐలమ్మ పేరిట మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశం ఐక్యంగా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తలేదన్నారు. విద్యా విధానాన్ని కాషాయీకరణం చేయడం సరికాదన్నారు. విద్యకు బడ్జెట్‌లో కొంతమేరకు నిధులు పెంచినప్పటికీ ఇంకా పెంచాలన్నారు.

విద్యార్థులను గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలి: కే.శ్రీనివాస్‌

విద్యార్థులను గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు డాక్టర్‌ కే.శ్రీనివాస్‌ అన్నారు. మహాసభల్లో ‘విద్యలో రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడారు. విద్యార్థులను గొప్ప పౌరులుగా తీర్చిదిద్ది, వారు సమాజ మార్పునకు కృషి చేసేలా తీర్చిదిద్దాలన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి, విశ్వసించి, అనుసరించి, అమలు చేసే బాధ్యత పౌరులదేనన్నారు. చదువు సమాజ మార్పునకు ఉపయోగపడుతుందన్నారు. విద్యా రంగంతోపాటు ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నాయని, ఉపాధ్యాయులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ప్రజల స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని, అనేక కారణాల వల్ల ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అవుతుందన్నారు. పోరాట శక్తిని కలిగి ఉండాలని, అదే మార్పును తెస్తుందన్నారు. ప్రతిఒక్కరూ మంచి సమాజం కోసం కృషి చేయాలన్నారు.

సమాజంలో పెరుగుతున్న అంతరాలు : కే.నాగేశ్వర్‌

దేశంలో పాలకులు అవలంభిస్తున్న అసంబద్ధమైన విధానాల వల్ల సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయని ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. దేశంలో బడా పెట్టుబడిదారుల ఆదాయాలు భారీగా పెరుగుతున్నా, వారి నుంచి తక్కువ ట్యాక్సీ వసూలు చేస్తున్నారన్నారు. మధ్య తరగతి ఉద్యోగుల నుంచి మాత్రం వసూలు చేసే పన్ను అధికంగా ఉందని, అదే సమయంలో పెట్టుబడిదారులకు అధిక పన్ను రాయితీ ఇస్తుందన్నారు. దేశంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు అల్పహారం అందించేందుకు అయ్యే ఖర్చు కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే ఉందన్నారు.

100 శాతం అక్షరాస్యత సాధించాయి: - జూలకంటి రంగారెడ్డి

ప్రపంచంలో పలు దేశాలు నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించాయని, భారత దేశంలో 67శాతం అక్షరాస్యత మాత్రమే సాధించామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల కాలంలో రాజ్యాంగం ద్వారా ఏమి సాధించామని అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ వ్యక్తి అభ్యున్నతికి, సమాజ వికాసానికి విద్య అవసరమన్నారు. ఉపాధ్యాయులు వేసే పునాది ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ మారం జగదీష్‌ మాట్లాడుతూ 206 సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేశానని పెండింగ్‌ బిల్లు సమస్యలు చాలా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, రాష్ట్ర విద్య కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళీ, ఏపీయూటీఎఫ్‌ అధ్యక్షుడు నక్క శ్రీనివాసరావు, ఎస్టీఎ్‌ఫఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సంయుక్త, టాఫ్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, టీజీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, నల్లగొండ జిల్లా టీఎ్‌సయూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బక్క శ్రీనివాసచారి, పెరుమాళ్ల వెంకటేశం, మాజీ అధ్యక్షులు ఎడ్ల సైదులు, జి.అరుణ, ఆయుష్‌ ఘోష్‌, విద్యాసాగర్‌ రెడ్డి, నలపరాజు వెంకన్న, బంగారయ్య, లక్ష్మారెడ్డి, రాములు, సోమ శేఖర్‌, రాజశేఖర్‌ రెడ్డి, నాగమణి, యాకయ్య, నర్సింహ తదితరులు ఉన్నారు. అంతకు ముందు పట్టణంలో నల్లగొండ గడియారం సెంటర్‌ నుంచి లక్ష్మి గార్డెన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Dec 29 , 2024 | 12:58 AM