పంట నష్టపరిహారం అందించేందుకు కృషి
ABN , Publish Date - Oct 26 , 2024 | 12:46 AM
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల మండలం మదారిగూడెం గ్రామంలో వర్షంతో నేలవాలిన పొలాలను ఆయన పరిశీలించారు.
ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి
హాలియా, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల మండలం మదారిగూడెం గ్రామంలో వర్షంతో నేలవాలిన పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేయగా, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏవో సరిత, హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, కుందూరు వెంకట్‌రెడ్డి, పోషం శ్రీనివా్‌సగౌడ్, రిక్కల కరుణాకర్‌రెడ్డి, రిక్కల వెంకట్‌రెడ్డి, నకిరేకంటి సైదులు, శోభన్‌బాబు, సర్వర్, ఇబ్రహీం, చెన్ను వెంకట్‌రెడ్డి, శేఖర్, ఫకృద్దీన్, రబ్బాని, వెంకయ్య, తదితరులు ఉన్నారు.
గీత కార్మికుల రక్షణకు ప్రభుత్వం కృషి
గీత కార్మికుల రక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులతో రూపొందించిన రక్షణ కిట్లను పంపిణీ చేస్తోందన్నారు. గతంలో రక్షణ కిట్లు లేక ప్రమాదవశాత్తు మృతి చెందిన వారు. వైకల్యానికి గురైన వారు చాలామంది గీత కార్మికులు ఉన్నారన్నారు. గత ప్రభుత్వం గీత కార్మికులను విస్మరించిందని విమర్శించారు. కార్యక్రమంలో అంకతి సత్యం, ఎక్సైజ్ సీఐ కల్పన, నాంపల్లి సీఐ సైదులు, నాయకులు కాకునూరి పెదనారాయణగౌడ్, భాస్కర్‌నాయక్, కృష్ణానాయక్, కాసాని చంద్రశేఖర్, రాజాప్రసాద్, పిల్లి ఆంజనేయులు, గౌని రాజారమే్‌షయాదవ్, వెంపటి శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
అధైర్య పడవద్దు .. పరిహారం ఇప్పిస్తాం
(ఆంధ్రజ్యోతి, నిడమనూరు): వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని, ప్రతీ ఒక్కరికి పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం మండలంలోని గుంటుకగూడెం గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. 1,370 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అఽధికారి మునికృష్ణయ్య, ఏఈవో క్రాంతికుమార్, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, నందికొండ మట్టారెడ్డి, బొల్లం శ్రీనివా్‌సయాదవ్, నూకల వెంకట్‌రెడ్డి, పగిళ్ల శివ, ఆలంపల్లి మైసయ్య, మేరెడ్డి వెంకటరమణ, ఆలంపల్లి కృష్ణ, సింగం రామలింగయ్య, మేరెడ్డి రాజిరెడ్డి, గొంగటి శ్రీనివాస్, వీరేశం, తరి నర్సింహ పాల్గొన్నారు.