Share News

బాలికల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:04 AM

బాలికల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

 బాలికల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఊకొండి గ్రామంలో బాలికలతో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు, జనవరి 24 : బాలికల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు మండలాల్లో ర్యాలీలు, వేడుకలు నిర్వహించారు. మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు హాజరైన రాజగోపాల్‌రెడ్డి గ్రామస్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. విద్యతోనే భవిష్యత మనుగడ సాధ్యమని, అందులో బాలికలకు అసమానతలు లేకుండా సముచితస్థానం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన కుంభం శ్రీనివా్‌సరెడ్డి, నారబోయిన రవిముదిరాజ్‌, సర్పంచ యాదగిరి, ఎంపీటీసీ విజయలక్ష్మి, సైదులు, ఉపసర్పంచ వెంకన్న, అంగనవాడీ కేంద్రాల పర్యవేక్షకురాలు సరస్వతీ, టీచర్లు సుమలత, లింగమ్మ, ఉమా పాల్గొన్నారు.

అడవిదేవులపల్లి : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నాగమణి, ప్రిన్సిపాల్‌ అబ్బా్‌సఅలీ, పీఈటీ, అంగనవాడీ టీచర్లు నారాయణమ్మ, శోభా, రమాదేవి, మణెమ్మ, రేణుక, బాలికలు పాల్గొన్నారు.

డిండి : మండల కేంద్రంలో జాతీయబాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రేణుకరెడ్డి, సిబ్బంది మంగమ్మ, సత్యవాణి, చంద్రకళ, లావణ్య పాల్గొన్నారు.

హాలియా: మండలంలోని కొత్తపల్లిలో మహిళలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి, అంగనవాడీ టీచర్లు గోవిందమ్మ, వజ్రమ్మ, సునీత, నాగజ్యోతి, మంగమ్మ పాల్గొన్నారు.

తిరుమలగిరి(సాగర్‌): మండలకేంద్రంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నాగమణి విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు విజయలక్ష్మీ, యాదమ్మ, కేజీబీవీ ఎస్‌వో కవిత, మీనా, పుష్పలత, విమల, బ్యులారాణి, హిమబిందు, అంగనవాడీ టీచర్లు కళావతి, పుష్ప, ఝాన్సీ, పాల్గొన్నారు.

కనగల్‌ : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వేజర్‌ శ్రీలత, హెచఎం వెంకటరాంరెడ్డి, ఉపాధ్యాయుడు ఆరూరి జానయ్య, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

నార్కట్‌పల్లి : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచఎం రాములు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సరిత, అంజమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 12:04 AM