నకిలీ పురుగుమందులు స్వాధీనం
ABN , Publish Date - Oct 18 , 2024 | 01:04 AM
నకిలీ పురుగుమందులతో రైతులను దగా చేస్తున్న వ్యవహారంపై అధికారులు స్పందించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన పరిధిలో గుట్టుగా సాగిపోతున్న నకిలీ ఫర్టిలైజర్స్ దందాను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది.
తనిఖీలో బయటపడ్డ వ్యాపారుల దందా
వీర్లపాలెంలో ఆగ్రో్‌సరైతుసేవా ఫర్టిలైజర్ దుకాణం సీజ్
మిర్యాలగూడలో ఇద్దరు డీలర్ల లైసెన్స రద్దు
వాడపల్లి పోలీసులకు వ్యవసాయాధికారుల ఫిర్యాదు
మిర్యాలగూడ అర్బన, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : నకిలీ పురుగుమందులతో రైతులను దగా చేస్తున్న వ్యవహారంపై అధికారులు స్పందించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన పరిధిలో గుట్టుగా సాగిపోతున్న నకిలీ ఫర్టిలైజర్స్ దందాను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో గురువారం జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ మిర్యాలగూడ ఏడీఏ దేవ్‌సింగ్‌తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడ పట్టణంలోని ఏచూరి శ్రీనివాసరావు ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్‌లో జరిపిన తనిఖీలో సింజెంటా కంపెనీ పేరు కలిగిన రూ.53వేల విలువైన నకిలీ చెస్, పురుగుమందులను గుర్తిం చి సీజ్ చేసినట్లు డీఏవో తెలిపారు. మిర్యాలగూడలో పట్టుబడ్డ నకిలీమందులపై ఆరాతీయగా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన డీలర్ సజ్జల రాజిరెడ్డి సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు. మిర్యాలగూడ కు చెందిన రాజశేఖర్‌రెడ్డి, రమే్‌షబాబు అనే వ్యాపారులు ఇచ్చిన సమాచా రం మేరకు వీర్లపాలెం గ్రామంలోని ఆగ్రో్‌సరైతు సేవా కేంద్రంలో తనిఖీలు జరపగా సుమారు రూ.1.50లక్షల విలువైన నకిలీ చెస్‌మందు డబ్బాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ మందులను స్వాధీనం చేసుకుని షాప్‌ను సీజ్‌చేసి, డీలరు రాజిరెడ్డి లైసెన్స రద్దు చేసినట్లు జేడీఏ తెలిపారు. అదేవిధంగా మిర్యాలగూడకు చెందిన ఏచూరి శ్రీనివాసరావు, రాజశేఖర్‌రెడ్డి అనే డీలర్ల లైసెన్సలను కూడా అధికారులు రద్దుచేశారు. అయితే నకిలీ చెస్‌మందును గుంటూరు జిల్లా నుంచి సరఫరా చేస్తున్న ధనావత రమేష్, గుట్టుగా విక్రయిస్తున్న డీలరు రాజిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వాడపల్లిపోలీసులకు ఫిర్యాదుచేసినట్లు జేడీఏ తెలిపారు. తనిఖీలో ఏవోలు డీ సైదానాయక్, సరిత పాల్గొన్నారు.