Share News

రైతు భరోసా అందించాలి

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:05 AM

రాష్ట్రంలో కోటీ యాబై మూడు వేల ఎకరాల భూమి సాగు చేసిన రైతులకు నేటికి రైతు బరోసా ఇవ్వలేదని , తక్షణమే రైతు భరోసా సాయం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతు భరోసా అందించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

ఆత్మకూరు (ఎం) అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోటీ యాబై మూడు వేల ఎకరాల భూమి సాగు చేసిన రైతులకు నేటికి రైతు బరోసా ఇవ్వలేదని , తక్షణమే రైతు భరోసా సాయం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో శనివారం సీపీఎం 8వ మండల మహాసభ నిర్వహించారు. సమావేశానికి ముందు సీపీఎం నాయకులు మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజనకు సంబందించి రాష్ట్రంలో 11,475 వేల కోట్ల రూపాయలు రైతుభరోసా ఇవ్వాల్సి ఉందన్నారు. వర్షాకాలంలో రైతులు పండించిన దాన్యాన్ని కోనుగోలు చేయడానికి తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో అసంపూర్తిగా నిలిచిన బునాదిగాని, భీమలింగం, కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం 266 కోట్ల నిధులు కేటాయించడం హర్షనీయమన్నారు. కాలయాపన చేయకుండా పనులు త్వరగా ప్రారంభించి పూర్తిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యుడు బోలగాని జయరాములు, రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి పైళ్ల యాదిరెడ్డి, మండల కార్యదర్శి వేముల బిక్షం, రచ్చ గోవర్ధన, వి.గోపాల్‌రెడ్డి, జి.స్వామి, రాచమల్ల సత్తయ్య, తుమ్మల సత్యనారాయణరెడ్డి, టి.యాదయ్య, ఎం.శ్రీశైలం, బి. బుగ్గయ్య, భారతమ్మ, నర్సమ్మ, రాజమ్మ పాల్లొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 01:05 AM