మృత్యువుతో పోరాడి..
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:03 AM
తాతయ్యా.. అంటూ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వీడి యో కాల్‌లో పలకరించే మనుమరాలు ఇక లేదని తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 72రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మనుమరాలు కన్నుమూయటంతో నేరేడుచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కార్డియాక్ అరెస్ట్‌తో విద్యార్థిని మృతి
71రోజుల పాటు కోమాలోనే
విషాదంలో కుటుంబ సభ్యులు
నేరేడుచర్ల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తాతయ్యా.. అంటూ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వీడి యో కాల్‌లో పలకరించే మనుమరాలు ఇక లేదని తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 72రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మనుమరాలు కన్నుమూయటంతో నేరేడుచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి కుమార్తె సౌజ న్య, వేణుమాధవరెడ్డి దంపతులు ఉద్యోగరీత్యా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ఫ్రాన్సి్‌సకోలో స్థిరపడ్డారు. అల్లుడు వేణుమాధవ్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె దుర్గాశ్రీయావాసిని (12) ఏడో తరగతి చదువుతుండ గా, ధావని(9) రెండో తరగతి చదువుతోంది. దుర్గాశ్రీయావాసిని నేరేడుచర్లలోని అమ్మమ్మ ఇంట జన్మించి ఐదేళ్ల వరకు అమ్మమ్మ తాతయ్య సంరక్షణలో ఉంది. దుర్గా శ్రీయవాసిని ఈ ఏడాది అక్టోబరు 12వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన ఇంట్లో కుప్పకూలిపడిపోవటంతో వైద్య సిబ్బంది ఆమెకు సీపీఆర్(హృదయ శ్వాసకోశ పునరుజ్జీవన చర్య) చేసి స్టాన్‌ఫోర్డ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. కార్డియాక్‌అరె్‌స్టగా గుర్తించిన వైద్యులు చికిత్స చేస్తుండగా, 71రోజులపాటు కోమాలోనే ఉంది. వైద్యచికిత్సకు రోజుకు 65వేల డాలర్లు (సుమారు రూ.40కోట్లు) ఖర్చుకాగా, ఎక్కువశాతం ఇన్సూరెన్స్ కంపెనీ భరించింది. ఫిజియోథెరపీ నిమిత్తం ఈ నెల 20న ఆమెను శాన్‌ఫ్రాస్కి స్‌కోలోని ఓ రీహ్యాబిటేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మర్నాడు(ఈ నెల 21న) వైద్యులు ప్రకటించారు. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్టు రావడంపై అక్కడి వైద్యులు క్షుణ్ణంగా తె లుసుకుని మృతదేహాన్ని విద్యుత్ సంబంధ విధానంలో దహనం చేయనున్నారు.
ఈ నెల 27న అంత్యక్రియలు
దీంతో ఈ నెల 27వ తేదీన తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) శాన్‌ఫ్రాన్సిస్కోలో దుర్గాశ్రీయావాసిని అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మనుమరాలు మృతివార్త తెలియటంతో సత్యనారాయణరెడ్డి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బంధువులు, స్నేహితులు నేరేడుచర్లలోని వారి ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. గత ఏడాది దుర్గాశ్రీయవాసిని కుటుంబ సభ్యులు నేరేడుచర్లకు వచ్చి వెళ్లగా, అమ్మమ్మ తాతయ్యలు సత్యనారాయణరెడ్డి, విజయలక్ష్మి ఆరు నెలలపాటు శాన్‌ఫ్రాస్కిస్కోలోని కుమార్తె వద్దకు వెళ్లి వచ్చారు. ఇంతలోనే మరణవార్త విని తీవ్ర భావోద్వేగానికి లోనుకాగా, నేరేడుచర్లలో విషాధచాయలు అలుముకున్నాయి.