పత్తి కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:48 AM
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణ పరిధిలోని రాఘునాథ్‌పూర్ మార్గమధ్యలో ఉన్న శ్రీమల్లిఖార్జున కాటన ఇండసీ్ట్రలో శనివారం అగ్నిపమాదం చోటుచేకుంది.
ఆలేరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణ పరిధిలోని రాఘునాథ్‌పూర్ మార్గమధ్యలో ఉన్న శ్రీమల్లిఖార్జున కాటన ఇండసీ్ట్రలో శనివారం అగ్నిపమాదం చోటుచేకుంది. ఇండసీ్ట్రలోని గోదాం బయట ఉన్న పత్తి నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే యజమాని అయిన ఇల్లందుల మల్లే్‌షకు సమాచారం అందించారు. దీంతో ఆయన అగ్నిమాపక కేంద్రానికి ఫోనచేయగా, విషయాన్ని తెలిసిన ఫైర్‌ఇంజన సిబ్బంది హుటాహుటిన కొనుగోలు కేంద్రానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ లోగా సుమారు 3వేల క్వింటాళ్ల మేర పత్తి దగ్ధమైందని పరిశ్రమ యజమాని తెలిపారు. సుమారు రూ.2కోట్ల మేర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రజనీకర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి విద్యుత షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు.