అతి వేగానికి ఐదు ప్రాణాలు బలి
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:59 AM
అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన జిల్లా కేంద్రం సమీపంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ బాలునాయక్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు జటంగి సాయి, అంతటి నవీన, చింతమళ్ల ధనుష్, మారగొని మహేష్, గణేష్, శివ చిన్ననాటి స్నేహితులు. వీరిలో ధనుష్ సూర్యాపేటలో ఎర్టిగా కారును ఈ నెల 10వ తేదీన అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు.

స్పీడో మీటరుపై 170 కిలోమీటర్ల వేగం
కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న వైనం
కేతేపల్లి సమీపంలో ఘటన
సూర్యాపేట రూరల్, కేతేపల్లి, ఏప్రిల్ 11 : అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన జిల్లా కేంద్రం సమీపంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ బాలునాయక్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు జటంగి సాయి, అంతటి నవీన, చింతమళ్ల ధనుష్, మారగొని మహేష్, గణేష్, శివ చిన్ననాటి స్నేహితులు. వీరిలో ధనుష్ సూర్యాపేటలో ఎర్టిగా కారును ఈ నెల 10వ తేదీన అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. గురువారం ఉదయం 10గంటల ప్రాంతంలో ధనుష్, మిగిలిన ఐదుగురు స్నేహితులను కారులో ఎక్కించుకున్నాడు. వీరందరూ సూర్యాపేటకు వెళ్లి మరో స్నేహితుడు ఉదయ్‌ను కారులో ఎక్కించుకున్నారు. అందరూ కారులో సూర్యాపేట పట్టణంలో సరదాగా తిరిగారు. మధ్యాహ్నం సమయంలో ఓ హోటల్‌లో భోజనం చేసి మూడు గంటల సమయంలో అదే కారులో కేతేపల్లికి బయలుదేరారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం శివారులోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై కారు అతి వేగంతో అదుపుతప్పి ఎడమవైపు ఉన్న చెట్టును కారు వెనుకభాగం బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి సాయితేజ (17), అంతటి నవీన(18)అక్కడికక్కడే మృతి చెందారు. మారగోని మహేష్, గణేష్, శివకు గాయాలయ్యాయి. కారు నడిపిన చింతమళ్ల ధనుష్, ఉదయ్ భయంతో ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను, ముగ్గురు క్షతగాత్రులను సూర్యా పేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కేతేపల్లికి చెందిన యువకుల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి రోదించారు.
స్పీడో మీటరుపై 170కిలోమీటర్ల వేగం
ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తే స్పీడ్ మీటరుపై ముల్లు 170వద్ద ఆగి ఉంది. ఆ వేగంతో కారును నడుపుతున్నట్లు పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. ఽకారును నడుపుతున్న ధను్‌షకు, పక్క సీట్లో ఉన్న మారగోని మహేష్ క్షేమంగా బయటపడ్డారు. జటంగి సాయి పదో తరగతి పరీక్షలు రాశాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవి, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ బాలునాయక్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన సందర్భంగా కొద్దిసేపు ట్రాఫిక్‌జాం కావడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు.
ముగ్గురు మిత్రుల విషాదాంతం
సూర్యాపేట క్రైం:రంజాన పర్వదినాన సూర్యాపేటలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఖమ్మం క్రాస్‌రోడ్డు సమీపంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎంను వెనక నుంచి సూర్యాపేటకు చెందిన కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సూర్యాపేటలోని పొట్టిశ్రీరాములు సెంటర్‌కు చెందిన కారు నడుపుతున్న బీటెక్ పూర్తిచేసిన నవీద్(25), బొడ్రాయి బజార్‌కు చెందిన వెన్న నిఖిల్‌రెడ్డి(24), జాకీర్‌హుస్సేన నగర్‌కు చెందిన రాకే్‌ష(24)లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు సూర్యాపేటలోని జమ్మిగడ్డకు చెందిన హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన ఆదిత్యకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలియగానే పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ ఆదిత్యకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రంజాన పర్వదినం కావడంతో యువకులు నవీద్‌తోకలిసి పండుగ చేసుకున్న అనంతరం రాత్రి పూట భోజనం చేసేందుకు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్దఎత్తున జనరల్ ఆసుపత్రికి తరలివచ్చారు.