Share News

వారం రోజుల్లో గోదావరి జలాలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:19 AM

జిల్లాలోని శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు వారం రోజుల్లో గోదావరి జలాలు విడుదల కానున్నాయి.

వారం రోజుల్లో గోదావరి జలాలు
శ్రీరాంసాగర్‌ 71డీబీఎం మెయిన కాల్వ

అర్వపల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టుకు వారం రోజుల్లో గోదావరి జలాలు విడుదల కానున్నాయి. జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు వారబందీ పద్ధతిలో పంటలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఎస్సారెస్పీ డీఈ సత్యనారాయణ సోమవారం తెలిపారు. 1500 క్యూసెక్కుల చొప్పున 69, 70, 71 డిసి్ట్రబ్యూటరీలకు మార్చి 31 వరకు నీటిని విడుదల చే సే అవకాశం ఉంది. జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని ఆయకట్టు కిం ద 2.44లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు దుక్కులు దున్ని, వరి నారు పో సుకొని భూములను సిద్ధం చేసుకుని నీటి కోసం ఎదురుచూస్తున్నారు. జనగాం జిల్లా కొడకండ్ల బయ్యన్నవాగు నుంచి జలాలను విడుదల చేయనున్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:19 AM