తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:45 AM
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఈ నెల 27వతేదీన జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీ య సమ్మేళనం వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు.
ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్
సూర్యాపేటటౌన్, సెప్టెంబరు 15: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఈ నెల 27వతేదీన జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీ య సమ్మేళనం వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు స్వరాష్ట్రం కోసం తమ జీవితాలను, సమయాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కారించాలని కోరు తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమకారుల జన చైతన్య యాత్ర బృందం ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా తెలంగాణ ఉద్యమ కారుల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. ఈ నెల 27న సికింద్రాబాద్‌లోని హరిహర కళా భవన్‌లో జరిగే సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అనంతుల మధు, నారబోయిన కిరణ్, దరావత్ నాగేశ్వర్‌రావునాయక్, అంజయ్య, సంతో్‌షరెడ్డి, పడిదల ప్రసాద్, సుదర్శన్‌రెడ్డి, ఐలయ్య పాల్గొన్నారు.